Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పల్లెటూరి అమ్మాయిలతో విచ్చలవిడి శృంగారమే 'కామదేవి'

Advertiesment
కామదేవి మూవీ
, గురువారం, 19 డిశెంబరు 2013 (19:48 IST)
WD
తమిళనాడులో సంచలన విజయం సాధిస్తున్న పుల్లుకట్టు ముత్తమ్మ చిత్రాన్ని లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్‌ బేనర్‌పై అడ్డాల వెంకటరావు, చింతలపూడి వాసు సంయుక్తంగా కామదేవి పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం తెలిసిందే

చిత్ర విశేషాలను నిర్మాతలు తెలుపుతూ యువతకు సందేశమిచ్చే అంశాలతో రొమాంటిక్‌గా సాగే సన్నివేశాలతో రూపొందించబడిన చిత్రమిది. అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగే ఓ యువకుడు పెళ్ళిచేసుకున్న తర్వాత సర్వం కోల్పోవడంతో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసివచ్చింది అన్నది, ఈ చిత్రం. మంచి చదువు చదువుకుని పట్నం నుంచి పల్లెటూరికి వచ్చిన ఓ యువకుడు చేలగట్టుల మీద, మంచినీటి బావుల దగ్గర పరిచయమైన అమ్మాయిలను తన పట్నం తెలివితేటలతో వశం చేసుకుని అనుభవిస్తూ జీవితాన్ని గడిపి, తను తీరా పెళ్ళి చేసుకునేసరికి పూర్తి యవ్వన్నాన్ని కోల్పోతాడు.

ఇలా విచ్చలవిడిగా అమ్మాయిలతో గడిపిన ప్రతివారికి ఇలాంటి పరిస్థితే ఎదురౌతుందనేదే ఈ చిత్రంలోని సందేశం. పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. వారంలో సెన్సార్‌ కూడా పూర్తిచేసి జనవరి మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. యువతను ఆకట్టుకునే మూడు పాటలూ చిత్రంలో హైలైట్‌గా వుంటాయి. హేమ, హసీనా, మినుప్రియ, నళిని, జానకి, ప్రభాత్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు; రాజశేఖర్‌రెడ్డి, పాటలు; పొందూరి. కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం; ముత్తుపాండి. నిర్మాతలు; అడ్డాల వెంకటరావు, చింతలపూడి వాసు.

Share this Story:

Follow Webdunia telugu