నీడ అంటే వెంటాడుతుంది. ఒకటి కాపాడుతుంది. ఈ రెంటికి తేడానే మా 'నీడ' చిత్రమని దర్శకుడు జె.ఎస్. చౌదరి అన్నాడు. అనూజ్ రామ్, దేవన జంటగా టాలీవుడ్ ట్రెండ్స్ బేనర్‌పై వెలువోలు శ్రీనివాసరావు నిర్మించారు. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. ఈ నెల 13న విడుదలవుతుంది. దర్శకుడు మాట్లాడుతూ... భిన్నమైన కథ. విజయ్ రెండు చక్కని పాటలిచ్చారు. రీ-రికార్డింగ్ హైలైట్‌గా ఉంటుంది అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమిది. అన్ని ఏరియాల్లో బిజినెస్ అయింది. నైజాంలో శ్రీచక్ర ఫిలింస్ ద్వారా విడుదలవుతుంది అన్నారు.