నవంబర్ మూడో వారంలో కృష్ణవంశీ-నానిల 'పైసా'
, బుధవారం, 6 నవంబరు 2013 (16:04 IST)
దర్శకుడు కృష్ణవంశీ, యువ హీరో నాని, వరుస విజయాలను సాధిస్తున్న టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రమేష్ పుప్పాల... ఈ ముగ్గురు రేర్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న చిత్రం 'పైసా'. ఈ చిత్రం నవంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ - ''మా బేనర్‌లో కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మక చిత్రంగా రూపొందిస్తున్న 'పైసా' చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ మూడోవారంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలు 'మిరపకాయ్', 'శ్రీమన్నారాయణ' తర్వాత 'పైసా' హ్యాట్రిక్ చిత్రం కాబోతోంది. కృష్ణవంశీగారి కెరీర్‌లో, నాని కెరీర్‌లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం నాకు వుంది. ఈ చిత్రం టీజర్‌కి, ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సాయికార్తీక్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ను చేయబోతున్నాం'' అన్నారు. నాని, కేథరిన్, సిద్దికా, చరణ్‌రాజ్, రాజా రవీందర్, దువ్వాసి, ఆర్కే, తబర్, లోబో, రాజు శ్రీవాస్తవలు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమా టోగ్రఫీ: సంతోష్‌కుమార్ రాయ్, సంగీతం: సాయికార్తీక్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కృష్ణవంశీ.