టాలీవుడ్‌లో బిరియాని వర్సెస్ ధూమ్ 3... డిశంబరు 20న ఢీ
, బుధవారం, 18 డిశెంబరు 2013 (22:01 IST)
ప్రతి శుక్రవారం సినిమాలు విడుదల కావడం సహజమే. అయితే ఈ నెల 20న మాత్రం రెండు డబ్బింగ్ చిత్రాలు విడుదల కానున్నాయి. ఒకటి తమిళ చిత్రం 'బిరియాని' కాగా, రెండోది బాలీవుడ్ 'ధూమ్-3'. బాలీవుడ్ చిత్రంలో కత్రినా అందాలు యూత్‌ను మరిపించనున్నాయి.ఓ దొంగతనం గురించి సాగే కాన్సెప్ట్‌తో ధూమ్ 3 రూపొందింది. ఇందులో దొంగ తెలివితేటలు హైలైట్‌గా ఉంటాయి. అమీర్ ఖాన్ కామెడీ సన్నివేశాలు, అభిషేక్ బచ్చన్ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందింది. ఒకరకంగా ఇది మల్టీస్టారర్ చిత్రమన్నమాట. కాగా, బిరియాని మాత్రం సోలో హీరో. కార్తి నటించిన చిత్రమిది. ఇందులోనూ పంజాబీ భామ మాండ్రీ తన గ్లామర్‌ను చూపించబోతుంది. కామెన్‌మేన్ తనుకు ఎదురైన ప్రాబ్లమ్‌ను ఎలా సాల్వ్ చేసుకున్నాడనేదే చిత్ర కథాంశం. బిరియాని తినడానికి వెళుతుండగా జరిగిన ఓ సంఘటన అతని జీవితాన్ని మార్చేస్తుంది. మరి ఈ రెండు చిత్రాలూ తెలుగులో దాడి చేయనున్నాయి.