Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గ్రీకు వీరుడు'కు యు/ఎ సర్టిఫికెట్‌... వరల్డ్‌వైడ్‌గా మే 3న విడుదల

Advertiesment
నాగార్జున
, బుధవారం, 24 ఏప్రియల్ 2013 (20:58 IST)
WD
కింగ్‌ నాగార్జున హీరోగా కామాక్షి మూవీస్‌ పతాకంపై అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన అగ్రనిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి కింగ్‌ నాగార్జున హీరోగా నిర్మిస్తున్న భారీ చిత్రం 'గ్రీకు వీరుడు' సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. వరల్డ్‌వైడ్‌గా మే 3న ఈ చిత్రం విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ - ''మా 'గ్రీకువీరుడు' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. వరల్డ్‌వైడ్‌గా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి స్పందన లభిస్తోంది. థమన్‌ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ అందించారు.

త్వరలోనే ఈ చిత్రం హెక్సా ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రంలో నాగార్జునగారి అభిమానులు ఆశించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో వున్నాయి. తప్పకుండా మా 'గ్రీకువీరుడు' చిత్రం ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తుంది. మా బేనర్‌లో ఈ చిత్రం మరో సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది'' అన్నారు.

కింగ్‌ నాగార్జున, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా చోప్రా, కె.విశ్వనాథ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, నాగబాబు, ఎం.ఎస్‌.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, కాశీ విశ్వనాథ్‌, వెన్నెల కిషోర్‌, నాగినీడు, సుప్రీత్‌, అశోక్‌కుమార్‌, భరత్‌రెడ్డి, సంజయ్‌ స్వరూప్‌, తాగుబోతు రమేష్‌, సారిక రామచంద్రరావు, గీతాంజలి, సుధ, జయలక్ష్మీ, జయవాణి, లహరి, ఇందూ ఆనంద్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: అనిల్‌ భండారి, ఆర్ట్‌: రవీందర్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఫైట్స్‌: విజయ్‌, సాల్మన్‌రాజు, స్టిల్స్‌: జూపల్లి రఘు, కో-డైలాగ్స్‌: ప్రవీణ్‌వర్మ, స్క్రీన్‌ప్లే: హరి, ఎం.శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వివేకానంద కూచిభొట్ల, కో-ప్రొడ్యూసర్‌: డి.విశ్వచందన్‌రెడ్డి, నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి, కథ-మాటలు-దర్శకత్వం కె.దశరథ్‌.

Share this Story:

Follow Webdunia telugu