ఏప్రిల్ 5న ఎన్టీఆర్- శ్రీనువైట్ల - బండ్ల గణేష్‌ల 'బాద్షా'
, శనివారం, 23 మార్చి 2013 (23:06 IST)
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అగ్రనిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'బాద్‌షా'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది.ఈ సందర్భంగా అగ్ర నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ - ''మా చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పిన సూపర్‌స్టార్ మహేష్‌గారికి థాంక్స్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలామంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెలాఖరులో ఈ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి ఏప్రిల్ 5న వరల్డ్‌వైడ్‌గా మా 'బాద్‌షా'ని విడుదల చేస్తున్నాం. ఎన్టీఆర్ కెరీర్‌లో నెం.1 చిత్రంగా 'బాద్‌షా' నిలుస్తుంది. డైరెక్టర్ శ్రీను వైట్లకి 'దూకుడు' తర్వాత వస్తోన్న మరో సూపర్ డూపర్ హిట్ మూవీ ఇది. అలాగే 'గబ్బర్‌సింగ్' తర్వాత మా బేనర్‌లో వస్తోన్న మరో బ్లాక్‌బస్టర్ మూవీ 'బాద్‌షా'' అన్నారు. ఎన్టీఆర్, కాజల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో 50 మంది ప్రముఖ నటీనటులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్., కె.వి.గుహన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు సాంకేతికవర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.