Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 13న 'కిస్‌'... సమైక్య ఉద్యమంతో చిన్న చిత్రాలకు పంట...

Advertiesment
కిస్ మూవీ
, మంగళవారం, 3 సెప్టెంబరు 2013 (16:58 IST)
WD
పంజా ఫేం అడవి శేషు నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'కిస్‌'. మై డ్రీమ్‌ సినిమా ప్రై.లిమిటెడ్‌, తౌజండ్‌ లైట్స్‌ చిత్రం బేనర్‌పై అడివి సాయికిరణ్‌, శేషు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్‌ కెనడా ఫొటోజెనిక్‌ ప్రియా బెనర్జీ కథానాయిక. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత సాయికిరణ్‌ అడవి మాట్లాడుతూ... 'కిస్‌' పాటలకి మంచి స్పందన లభించింది. యూత్‌కి పాటల్‌ బాగా రీచ్‌ అయ్యాయి. ఒక అమ్మాయికి, అబ్బాయికి మద్య 24 గంటలపాటు జరిగిన జర్నీని సింపుల్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కించాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మనీ వేస్ట్‌ చేశామనే ఫీలింగ్‌ కలగకుండా ఫుల్‌ ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రముంటుంది. శేష్‌ క్యారెక్టర్‌ హైలైట్‌గా ఉంటుంది. ఈ నెల13న విడుదల చేస్తున్న మా చిత్రాన్ని ఓవర్సీస్‌లో ప్రణీత్‌ మీడియా, 1000 లైట్స్‌ వారు విడుదల చేస్తున్నారు. డెఫినెట్‌గా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అని అన్నారు.

అడివి శేషు మాట్లాడుతూ... నేను ముంబయిలో ఉండగా నవరాత్రి సమయంలో కార్‌లో వెళుతుండగా ఒక టపోరి అబ్బాయి, క్లాస్‌ అమ్మాయి మధ్య సంభాషణలను గమనించాను. వారిద్దరి మద్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథ రాశాను. ఈ సినిమా కోసమని 'పంజా' చిత్రం తరువాత చాలా ఆఫర్లను వదులుకున్నాను. సంవత్సరం పాటు నేను పడిన కష్టం ఈ చిత్రం. సింపుల్‌ ఎమోషన్స్‌ ఉన్న చిత్రమిది.

అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. కామన్‌ మ్యాన్‌కి ఈజీగా కనెక్ట్‌ అవుతుంది. ప్రియా బెనర్జీ నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేసింది. ఆల్‌రెడీ ఆమెకి ఓ పెద్ద బ్యానర్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఇటీవలె కొన్ని కాలేజ్‌లను విజిట్‌ చేశాం. అక్కడ పాటలకు రెస్పాన్స్‌ బావుంది. ఈ వారంలో వైజాగ్‌, వరంగల్‌ ప్రాంతాలను సందర్శిస్తాం. ప్రేక్షకుల ఆదరణ మాకు కావాలి అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షెనీల్‌దియో, సహనిర్మాత: ఆనంద్‌ బచ్చు, నిర్వహణ: భవానీ అడివి, దర్శకత్వం: అడివి శేషు.

Share this Story:

Follow Webdunia telugu