Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'యమలీల-2' సెన్సార్‌ పూర్తి - నవంబర్‌ 28 విడుదల

Advertiesment
yamaleela 2 censor report
, మంగళవారం, 18 నవంబరు 2014 (15:38 IST)
డా|| కె.వి.సతీష్‌ హీరోగా కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో డి.ఎస్‌.మ్యాక్స్‌ సమర్పణలో క్రిష్వి ఫిలింస్‌ పతాకంపై ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆశా సతీష్‌ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'యమలీల-2'. సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 28న వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.
 
నవంబర్‌ 21న 'పాడుకుందాం హాయిగా' 
 
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఆడియోను ఇంత పెద్ద హిట్‌ చేసిన శ్రోతలకు థాంక్స్‌ చెప్తూ ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ వేడుకను 'యమలీల-2' పాటల పండగ - పాడుకుందాం హాయిగా' పేరుతో నవంబర్‌ 21 సాయంత్రం పార్క్‌ హయాత్‌లో వినూత్నంగా జరపడానికి ప్లాన్‌ చేశాం. నవంబర్‌ 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.
 
కో- ప్రొడ్యూసర్‌ డి.అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ - ''యమలీల-2' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. నవంబర్‌ 28న వరల్డ్‌వైడ్‌గా 500కి పైగా థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు. 
 
డా||కె.వి.సతీష్‌, దియా నికోలస్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్‌కింగ్‌, డా.ఎం.మోహన్‌ బాబు, డా||బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్‌.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, సదా, నిషా కొఠారి, ఆశిష్‌ విద్యార్థి, సాయాజీ షిండే, గీతాంజలి, బేబీ హర్షిత, అనంత్‌, సమీర్‌, ఉత్తేజ్‌, జోగి బ్రదర్స్‌, తాగుబోతు రమేష్‌, లక్ష్మణ్‌, సూర్య, సుభాష్‌, మాధవి, సత్యకృష్ణ, ప్రియ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా; శ్రీకాంత్‌ నారోజ్‌, ఎడిటర్‌; గౌతంరాజు, మాటలు; గంగోత్రి విశ్వనాథ్‌, భవానీ ప్రసాద్‌, ఆర్ట్‌; చిన్నా, ఫైట్స్‌; డ్రాగన్‌ ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత; ఎం.ఎ.జగన్నాథరెడ్డి, కో ప్రొడ్యూసర్‌: డి.కె.అరుణ్‌కుమార్‌, నిర్మాణం: క్రిష్వీ ఫిలింస్‌, నిర్మాత: ఆశా సతీష్‌, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం; ఎస్‌.వి.కృష్ణారెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu