Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తుది మెరుగుల్లో త్రిష 'నాయకి'

Advertiesment
trisha nayaki movie news
, శుక్రవారం, 18 మార్చి 2016 (22:05 IST)
త్రిష, గణేష్‌ వెంకటరామన్‌ ప్రదాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'నాయకి'. రాజ్‌ కందుకూరి సమర్పణలో గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ బేనర్‌లో గిరిధర్‌ మామిడిపల్లి, పద్మజ నిర్మిస్తున్న చిత్రమిది. గోవి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను దాసరి నారాయణరావు గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీజర్‌ ఆకట్టుకునేవిధంగా వుంది. సినిమాకూడా చాలా బాగుంటుందని  నమ్ముతున్నాను. గిరిధర్‌ 'లక్ష్మీరావే మా ఇంటికి' సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా దానికంటే పెద్ద సక్సెస్‌ అవుతుంది. హీరోయిన్స్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు నేను చాలా చేశాను. 'ఒసేయ్‌ రాములమ్మ'తో విజయశాంతి చరిత్రను తిరగరాసింది. హీరోలతో సమానంగా చేసిన పాత్ర అది. హీరోయిన్లు పాటలకే పరిమితం కాకుండా మంచి పెర్‌ఫార్మ్ చేసేవారు. త్రిష కూడా మంచి నటి. తను పెద్ద సక్సెస్‌ కావాలి. రఘు కుంచె మంచి బాణీలు ఇచ్చాడు. హారర్‌ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. సాయికార్తీక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడని తెలిపారు.
 
త్రిష మాట్లాడుతూ..హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయడం ప్రథమం. చాలా ఇంట్రెస్ట్‌తో సినిమా చేశాను. ఇందులో ఒక పాట కూడా పాడాను. త్వరలోనే ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు.
 
దర్శకుడు గోవి మాట్లాడుతూ.. గిరిధర్‌ హార్రర్‌ కథలు వింటున్నారని తెలిసి కథ చెప్పాను. ఆయనకు నచ్చడంతో త్రిషకు వినిపించారు. ఆమె విన్న ఐదు నిముషాలకే అంగీకరించారు. రెండు భాషల్లో సినిమా చేశాము. అందరికీ నచ్చేవిధంగా వుంటుంది. ఇందులో నాలుగు పాటలున్నాయని తెలిపారు.
 
నిర్మాత మాట్లాడుతూ.. మా బేనర్‌లో ఇది రెండవ సినిమా. త్రిష మేనేజర్‌గా ఎనిమిదేళ్ళు పనిచేశాను. నా రెండో సినిమానే థ్రిల్లర్‌ పాయింట్‌తో చేయాలనుకున్నాను. హార్రర్‌ కథ. రెండు భాషల్లో రూపుదిద్దుకుంటోంది. త్రిషను కొత్తగెటప్‌లో చూస్తారు. ప్రస్తుతం రీరికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu