Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'టైగర్' సెన్సార్ పూర్తి.. ఈ నెల 26న విడుదల

'టైగర్' సెన్సార్ పూర్తి.. ఈ నెల 26న విడుదల
, శనివారం, 20 జూన్ 2015 (18:02 IST)
స్నేహమా? ప్రేమా? అనడిగితే ఆ కుర్రాడికి ఎటువైపు మొగ్గాలో తెలియదు. ప్రియురాలూ కావాలి... స్నేహితుడూ ముఖ్యమే. రెండు కళ్లు లాంటి ఈ ఇద్దరి వల్ల ఆ యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం 'టైగర్'. వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలు. 
 
'ఠాగూర్' మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
 
చిత్ర విశేషాలను ఎన్వీ ప్రసాద్ చెబుతూ - ''సందీప్ కిషన్‌ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ క్యారెక్టర్. ఇప్పటివరకూ తను చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. థమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు.
 
'ఠాగూర్' మధు మాట్లాడుతూ - ''హీరోగా సందీప్ కిషన్ కెరీర్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్నివర్గాల వారు చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. 26న అత్యధిక థియేటర్లలో భారీఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అన్నారు.
 
తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, ఫైట్స్: వెంకట్, ఆర్ట్: రాము, ఆఫీస్ ఇన్‌చార్జ్: భగ్గా రామ్, కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.

Share this Story:

Follow Webdunia telugu