Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'టెన్త్‌ లో లక్‌, ఇంటర్‌లో కిక్‌, బి.టెక్‌లో..?'... మరో యూ(బూ)తు చిత్రం వస్తోంది

Advertiesment
Tenth Lo Luck
, బుధవారం, 29 అక్టోబరు 2014 (12:01 IST)
ఇటీవల తెలుగు సినిమాల్లో లోబడ్జెట్‌ చిత్రాల పేరుతోనూ, యూ(బూ)తు చిత్రాల కథలతో పలు చిత్రాలు వస్తున్నాయి. చిన్నా పెద్ద దర్శకులు అనే తేడాలేకుండా చిత్రాలు వేరే భాషలో తీసేసి.. తెలుగులో డబ్‌ చేసేస్తున్నారు. ఇక్కడ రిలీజ్‌కు ముందు కొన్ని సంఘాలు గొడవలు చేయడం మామూలే. ఇదో టెక్నిక్‌గా నిర్మాతలకు వుపయోగపడుతుంది. 
ఆమధ్యనే రామ్‌గోపాల్‌ వర్మలాంటివాడే... 'సావిత్రి' పేరుతో పబ్లిసిటీ చేసి అభాసుపాలయ్యాడు. ఇప్పుడు లక్ష్మీ తిరుతపమ్మ ఫిలిమ్స్‌(దేవుని పేరు)తో ఓ చిత్రం రాబోతుంది. టీచర్‌కు విద్యార్థికి వున్న ఆకర్షణ నేపథ్యంలో వస్తుంది. ఈ చిత్రానికి 'టెన్త్‌ లో లక్‌, ఇంటర్‌లో కిక్‌, బి.టెక్‌లో..?' అనే పేరు పెట్టారు. 
 
ఈ చిత్రం చూస్తే మీకే తెలుస్తుందని దర్శకుడు వెంకట్‌ టెక్నికల్‌గా చెబుతున్నాడు. హరిష్‌, జై, విష్ణు, కీర్తి, గీతాంజలి, కావేరి వంటివారు నటించారు. ఈ స్టిల్స్‌ బుధవారం నాడు విడుదల చేశారు. మరి దీనిపై సెన్సార్‌ ఏమంటుందో త్వరలో తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu