Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తారకరత్న... బొబ్బిలి పులి, సింహా, ఆదిలా ఉంటాడట... ఆగస్టు 5న చూడమంటున్నారు...

ప్రజలకు అన్ని 'ఫ్రీ' అంటూ రాజకీయనాయకులకు చెప్పే హక్కు ఎవరు ఇచ్చారు? ప్రజలే ఇచ్చారా? గెలిచాక.. ఆ ప్రజలకు విద్య, వైద్యం అనేవి ఎందుకు దూరం చేస్తున్నారంటూ? ధైర్యంగా ప్రశ్నించే కథతో తీసిన చిత్రమే 'కాకతీయుడు' అని చిత్ర దర్శకుడు సముద్ర వి. తెలియజేస్తున్నాడు

తారకరత్న... బొబ్బిలి పులి, సింహా, ఆదిలా ఉంటాడట... ఆగస్టు 5న చూడమంటున్నారు...
, సోమవారం, 1 ఆగస్టు 2016 (17:08 IST)
ప్రజలకు అన్ని 'ఫ్రీ' అంటూ రాజకీయనాయకులకు చెప్పే హక్కు ఎవరు ఇచ్చారు? ప్రజలే ఇచ్చారా? గెలిచాక.. ఆ ప్రజలకు విద్య, వైద్యం అనేవి ఎందుకు దూరం చేస్తున్నారంటూ? ధైర్యంగా ప్రశ్నించే కథతో తీసిన చిత్రమే 'కాకతీయుడు' అని చిత్ర దర్శకుడు సముద్ర వి. తెలియజేస్తున్నాడు.
 
తారక్‌రత్న, శిల్ప, యామిని, రేవతి నటీనటులుగా ఎల్‌విఆర్‌ ప్రొడక్షన్‌ బేనర్‌పై లగడపాటి వెంకాయమ్మ సమర్పణలో కె.వి. రామిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కాబోతుంది. ఈ చిత్రం ఆలస్యం కావడానికి కారణాన్ని వివరిస్తూ.. తారకరత్న రెండు పాత్రలను పోషించారు. అందులో సిక్స్‌ప్యాక్‌ పాత్ర ఒకటి. మరోటి సామాన్య పాత్ర. సిక్స్‌ప్యాక్‌ పాత్ర కోసం బాడీని పెంచి.. మరలా తగ్గించడానికి దాదాపు 10 నెలలు పట్టింది. అందుకే చిత్రం ఆలస్యమైందని దర్శకుడు తెలిపారు.
 
ఇంకా మాట్లాడుతూ... సింహా, బొబ్బిలి పులి, ఆది.. వంటి చిత్రాల స్థాయిలో మా చిత్రముంటుందని పేర్కొన్నారు. సమాజానికి ఉపయోగపడే సింహరాశి, శివరామరాజు, ఎవడైతే నాకేంటి వంటి కాన్సెప్ట్‌లతో ఈ చిత్రం కూడా వుంటుందని చెప్పారు. ముఖ్యంగా ప్రజలకు దగ్గరకావాల్సిన విద్య, వైద్య రంగాన్ని నాయకులు ప్రైవేట్‌పరం చేసి దూరం చేస్తున్నారనీ.. అసలు రాజకీయ నాయకుడు ప్రజలకు న్యాయం చేసేవాడు రావాలని.. లేదంటే.. చావాలని... ఘాటుగా స్పందించారు. గాంధీ, నెహ్రూ, ఎన్‌టిఆర్‌ వంటి నాయకులు కావాల్సిన అవసరం ఎంతైనా వుందని ఇందులో చెప్పామన్నారు.
 
చిత్రాన్ని విడుదల చేస్తున్న శోభారాణి మాట్లాడుతూ.. టైటిల్‌లోనే పవర్‌ వుంది. కాకతీయుల కాలంనాటి వంశానికి చెందిన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్నాతమ్ముడుగా తారకరత్న చేసిన పాత్రలు అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు. నిర్మాత లగడపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... సమాజానికి ఉపయోగపడే కథతో ఈ చిత్రాన్ని రూపొందించామని అందరూ ఆదరించాలని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటీనటులకు లేని సిగ్గుఎగ్గూ మాకేల... ముద్దు సీన్లకు 'సెన్సార్' ఓకే!