Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'సందీప్ కిషన్' హీరోగా 'జోరు': ఆగస్టులో రిలీజ్!

Advertiesment
sandeep kishan
, శుక్రవారం, 30 మే 2014 (12:18 IST)
యువ కథానాయకుడు 'సందీప్ కిషన్' హీరోగా నూతన చిత్ర నిర్మాణ సంస్థ 'శ్రీ కీర్తి ఫిలిమ్స్' ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'గుండెల్లో గోదారి' వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'కుమార్ నాగేంద్ర' ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నిర్మాతలు 'అశోక్, నాగార్జున'లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
కథానాయికలుగా 'రాశిఖన్నా', 'ప్రియాబెనర్జి', 'సుష్మ' లు నటిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి 'జోరు' అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. 'ప్రేమ, కుటుంబ కథా చిత్రంగా 'జోరు'ను రూపొందిస్తున్నట్లు దర్శకుడు కుమార్ నాగేంద్ర తెలిపారు.
 
ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై నెలాఖరులో గాని, ఆగష్టు నెల ప్రథమార్ధంలో గాని విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాతలు 'అశోక్, నాగార్జున'లు తెలిపారు. 
 
'జోరు' చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో బ్రహ్మానందం, ఎం.బాలయ్య, షాయాజీ షిండే, కాశీ విశ్వనాద్, తోటపల్లి మధు, అజయ్, సత్యం రాజేష్, సప్తగిరి, అన్నపూర్ణ, హేమ, రాజశ్రీ నాయర్, సంధ్య జనక్, కిరణ్మయి, మాధవి, పృథ్వి, సాయిరాం, వంశీ, పవన్‌లు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి మాటలు ; మీరాఖ్, పాటలు; వనమాలి,భీమ్స్ సిసిరోలియో, పూర్నాచారి; సంగీతం; భీమ్స్ సిసిరోలియో; ఎడిటింగ్; యస్.ఆర్.శేఖర్; కెమెరా; యం.ఆర్.పళనికుమార్, ఆర్ట్; మురళి కొండేటి; ఫైట్స్; వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; ఇ.వి.రాజ్ కుమార్. 

Share this Story:

Follow Webdunia telugu