మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న చిత్రం 'శౌర్య'. పోస్ట్‌ప్రొడక్షన్స్ పూర్తిచేసుకుని మార్చి 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. విడుదలయిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. దీంతో సినిమాపై నమ్మకం పెరిగింది. వేద సంగీతదర్శకునిగా పరిచయం కాబోతున్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బావున్నాయి. దశరథ్ సినిమా స్టొరీ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్‌లోనే కథను ఓకే చేసేశాను. త్వరలోనే సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నామని' చెప్పారు.
దసరథ్ మాట్లాడుతూ.. ఈరోజు కొత్త ట్రైలర్‌ను విడుదల చేశాం. మార్చి 4న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ప్రేమకథే అయినా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్రించాం' అని చెప్పారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. తొలి సినిమా అయినా వేద మంచి ట్యూన్స్ అందించాడు. ఇదివరకు మా బ్యానర్‌లో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్‌ను పరిచయం చేశాం.
ఈ సినిమాను ఓవర్‌సీస్‌తో కలిపి వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నాం. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనుకున్నారు. అందరికి లాభాలు రావాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరికుప్పల యాదగిరి, వేద, ప్రభాస్ శ్రీను, కృష్ణ చైతన్య తదితరులు చిత్ర విజయాన్ని కాంక్షించారు.