Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబర్‌ 14న 'పిల్లా నువ్వులేని జీవితం'

Advertiesment
Pilla Nuvvu Leni Jeevitham
, గురువారం, 30 అక్టోబరు 2014 (12:54 IST)
సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో బన్నివాసు, హర్షిత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నవంబర్‌ 14న విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో ముఖ్యపాత్ర పోషించిన జగపతిబాబుకు ఆడియో వేడుకలో కృతజ్ఞతలు చెప్పడానికి వీలుకాలేదు. శ్రీహరిగారు చెయ్యాల్సిన క్యారెక్టర్‌ని ఆయన చేశాడు. ఆరోగ్యం సహకరించకపోయినా అంబులెన్స్‌లో ఆడియో ఫంక్షన్‌కి వచ్చారు. అందుకే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.

 
దిల్‌రాజు మాట్లాడుతూ... బన్నీకి మా బేనర్‌లో ఆర్య, పరుగు రెండూ పెద్ద హిట్‌ అయ్యాయి. అలాగే సాయిధరమ్‌ తేజ్‌కి కూడా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని ఆశిస్తున్నాను. దిల్‌ సినిమా నుంచి అనూప్‌తో మంచి పరిచయముంది. అతనితో ఎప్పుడో సినిమా చేయాలి. కానీ కుదరలేదు. 'కొత్త బంగారులోకం' సినిమాకు అతనే రీ-రికార్డింగ్‌ చేశారు. ఈ సినిమాకు అనూప్‌ పాటలు పెద్ద హిట్‌ అయ్యాయి. నవంబర్‌ 14న విడుదలై అందరికీ నచ్చుతుందన్న నమ్మకముందని పేర్కొన్నారు.
 
అనూప్‌ మాట్లాడుతూ.... రెండు పెద్ద బేనర్స్‌ కలిసి చేస్తున్న సినిమాకు సంగీతం ఇవ్వడం చాలా సంతోషాన్నిచ్చింది. పాటలన్నీ బాగా వచ్చాయని పేర్కొన్నారు. దర్శకుడు రవికుమార్‌ చౌదరి మాట్లాడుతూ...హీరోగా తేజ్‌కు మంచి పేరు తెస్తుంది. అనూప్‌ బాణీలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆడియో తర్వాత పాటలకు మంచి క్రేజ్‌ వచ్చిందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu