Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆటోనగర్‌ సూర్య' సెన్సార్‌ పూర్తి - జూన్‌ 27 విడుదల

Advertiesment
Naga Chaitanya
, బుధవారం, 25 జూన్ 2014 (18:12 IST)
యువసామ్రాట్‌ నాగచైతన్య, సమంత జంటగా ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ సమర్పణలో మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆటోనగర్‌ సూర్య'. ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్‌ 27న విడుదలకు సిద్ధమైంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు దేవా కట్టా మాట్లాడుతూ - ''మా 'ఆటోనగర్‌ సూర్య' సెన్సార్‌ పూర్తయింది. సింగిల్‌ కట్‌ కూడా లేకుండా 'ఎ' సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు చాలామంచి సినిమా తీశారన్న అప్రిషియేట్‌ చేశారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రం వుంటుంది. జూన్‌ 27న విడుదలవుతున్న 'ఆటోనగర్‌ సూర్య' చిత్రాన్ని ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.
 
నిర్మాత కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ''ఆటోనగర్‌ సూర్య చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూన్‌ 27న వరల్డ్‌వైడ్‌గా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఏమాయ చేసావె, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల జంట నాగచైతన్య, సమంతలకు ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. అలాగే ఇష్క్‌, గుండె జారి గల్లంతయ్యిందే, మనం వంటి మ్యూజికల్‌ హిట్స్‌ అందించిన అనూప్‌ ఈ చిత్రానికి కూడా సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేశారు.
 
ఆల్రెడీ పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. వెన్నెల, ప్రస్థానం వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవా కట్టా ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా మలిచారు. లవ్‌, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలు వున్న ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది. జూన్‌ 27న విడుదలవుతున్న మా 'ఆటోనగర్‌ సూర్య' చిత్రాన్ని ఆదరించి సూపర్‌హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు. 
 
కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్‌, జయప్రకాష్‌రెడ్డి, ఎం.ఎస్‌.నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్‌, అజయ్‌, వేణుమాధవ్‌, బ్రహ్మాజీ, జీవా, శ్రీనివాసరెడ్డి, మాస్టర్‌ భరత్‌, మధు, పృథ్వీ, సమ్మెట గాంధీ, అజయ్‌ ఘోష్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్‌ నారోజ్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, సమర్పణ: ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌, నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: దేవా కట్టా.

Share this Story:

Follow Webdunia telugu