''నాకో అందమైన భార్య వుంది. కానీ మరో అమ్మాయిని ప్రేమించాలనుంది. ఆమె లీలావతి.'' ఆ తర్వాత ఏమయింది? అనేది 'మిస్ లీలావతి' సినిమా కథ అని ఇందులో ప్రధానపాత్ర పోషించిన కార్తీక్ తెలియజేశాడు. సొంత ఊరు, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన పి.సునీల్‌కుమార్‌రెడ్డి రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలవుతుంది.
పి.సునీల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.... ఈ మోడ్రన్ సొసైటీలో ఎక్కువ క్రైమ్స్ జరుగుతోంది అక్రమ సంబంధాలవల్లే. ఆ రిలేషన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అనేది సందేశాత్మకంగా రూపొందించడం జరిగింది. ప్రకృతికి, మనిషికి వుండాల్సిన బ్యాలెన్స్ అనేది తప్పడం వల్ల సునామీ, హుద్‌హుద్ వంటి విపత్తులు సంభవిస్తాయి. అలాగే భర్త, భార్య మధ్య బ్యాలెన్స్ అనేది లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఇబ్బందులు పడుతుంది అనేది చెప్పాం. తప్పకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఏప్రిల్ 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం ఆడియోను ఏప్రిల్ 6న రిలీజ్ చేస్తున్నాం.