Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పండుగకు గట్టెక్కించేది ఎవరు? గోపాల గోపాల్ వర్సెస్ ఐ...

Advertiesment
makar sankranti special gopala gopala movie
, శనివారం, 3 జనవరి 2015 (14:12 IST)
ఈ ఏడాది తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి. ఆ రోజు తెలుగులో పెద్ద చిత్రం ఒక్కటే విడుదలవుతుంది. వెంకటేష్‌, పవన్‌ కళ్యాన్‌ నటించి 'గోపాల గోపాల' రాబోతుంది. ఇప్పటికే థియేటర్లన్నీ ప్లాన్‌ చేశారు. ఐ సినిమా వస్తున్నా.. ఇంకా డేట్‌ కూడా ప్రకటించలేదు. అయితే ఈలోగా డబ్బింగ్‌ సినిమా వద్దంటూ ఓ వివాదం తెరపైకి వచ్చింది. అయితే గోపాల గోపాలతోపాటు మరే పెద్ద చిత్రం లేదు. అన్నీ సక్రమంగా వుంటే ఎన్‌టిఆర్‌ పూరీ చిత్రం రావాల్సి వుంది. కానీ నందమూరి జానకిరామ్‌ మరణంతో ఆ చిత్రం వెనక్కు వెళ్ళింది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
 
కాగా, బందిపోటుతో సహా నాలుగు చిన్న చిత్రాలు రెడీగా వున్నాయి. కానీ ఎవ్వరూ డేర్‌ చేయలేకపోతున్నారు. దీనికి కారణం 'ఐ' సినిమా వస్తుందని తెలియడమే. కాగా, గత కొద్ది సంవత్సరాలుగా సంక్రాంతికి ఒకటి, రెండు చిత్రాలే రాజ్యం ఏలుతున్నాయి. ఆ అవకాశం  గోపాల గోపాలకు వచ్చింది. ఈ చిత్రం ఓ మైగాడ్‌కు రీమేక్‌. అయితే ఆ సినిమాను చూసినవారికి ఈ చిత్రం నచ్చకపోవచ్చనే టాక్‌ కూడా ఇండస్ట్రీలో వుంది. 
 
హీరోయిజాన్ని పక్కనపెట్టి, దేవుళ్ళపై, దొంగబాబాలపై నిర్మొహమాటంగా చక్కని డైలాగ్‌లతో రాస్తే తప్పకుండా ప్రేక్షకులు చూస్తారని కొందరు భావిస్తున్నారు. కాగా, పీకే వంటి చిత్రాన్ని చూశాక.. గోపాల గోపాల ఎంతమేరకు ఆదరణ పొందుతుందో చూడాల్సిందేనని కొందరు ఆసక్తిగా వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu