Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్‌ 20న 'మైనే ప్యార్‌ కియా'

Advertiesment
june 20 maine pyar kiya release
, శుక్రవారం, 30 మే 2014 (12:31 IST)
ప్రదీప్‌, ఇషా తల్వార్‌ హీరోహీరోయిన్లుగా యునిఫై క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రదీప్‌ మాడుగుల దర్శకత్వంలో సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌ గిరడ నిర్మిస్తున్న రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మైనే ప్యార్‌ కియా'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్‌ 20న విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌ గిరడ మాట్లాడుతూ - ''మా 'మైనే ప్యార్‌ కియా' చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మైనే ప్యార్‌కియా అనే టైటిల్‌ పెట్టినప్పటికీ పాత హిందీ సినిమా మైనేప్యార్‌కియాకి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. 
 
ఇది ప్రతి ఒక్కరికి హార్ట్‌ టచ్చింగ్‌గా వుంటే బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఒక మోడ్రన్‌ లవ్‌స్టోరీని ఎంటర్‌టైనింగ్‌ వేలో చెప్పడం జరిగింది. దాన్ని ఆడియన్స్‌ తప్పకుండా రిసీవ్‌ చేసుకుంటారు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాని చూస్తారన్న నమ్మకం మాకు వుంది" అన్నారు. 
 
ప్రదీప్‌, ఇషా తల్వార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోమల్‌ ఝా, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, వెన్నెల రామారావు, వైవ హర్ష, వేణు, శివన్నారాయణ, ఉత్తేజ్‌, మధుమిత, సత్యదేవ్‌, కోటేశ్వరరావు, సోలో ఫేం స్వప్నిక, సుధాకర్‌వర్మ, కత్తి మహేష్‌, కుమార్‌ తేజ, సర్వమంగళ, ల్యాబ్‌ శరత్‌, ముద్దమందారం ప్రదీప్‌, సరస్వతి, సురేష్‌, ప్రాచి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్‌ వి., సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వా, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెన్నెల రామారావు, నిర్మాతలు: సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌ గిరడ, దర్శకత్వం: ప్రదీప్‌ మాడుగుల.

Share this Story:

Follow Webdunia telugu