పవన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ 'కాటమరాయుడు': అదరగొడుతున్న రేటింగ్
పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం కాటమ రాయుడు గ్రామీణ నేపథ్యం కలిగిన వినోదాత్మక చిత్రం. హీరో పవన్ కల్యాణ్ తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రజల పక్షాన నిలబడటమే చిత్ర కథ.
పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం కాటమ రాయుడు గ్రామీణ నేపథ్యం కలిగిన వినోదాత్మక చిత్రం. హీరో పవన్ కల్యాణ్ తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రజల పక్షాన నిలబడటమే చిత్ర కథ. తన సోదరులు అజయ్, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణలను తానే పెంచి పెద్ద చేస్తాడు. తమ్ముళ్లు అతడిని ఎంతగానో గౌరవిస్తుంటారు. కానీ హీరోయిన్ శ్రుతి హసన్ ప్రేమ కోసం ఆయుధాలు కింద పెట్టాల్సివచ్చిన పరిస్థితి ఎదురైనప్పుడు పవన్ అందుకు సిద్దపడ్డాడా అనేది సినిమాకు మూలమలుపు.
కాటమరాయుడు పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్. పవన్ అభిమానులకు, కుటుంబ ప్రేక్షకులకు ఇది పూర్తిగా నచ్చే సినిమా. పవన్ కల్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్, పంచ్ డైలాగులు, హైవోల్టేజ్ లో నడిచే యాక్షన్ దృశ్యాలతోపాటు డ్యాన్సులు మిమ్మల్ని ఎంటర్ టెయిన్ చేస్తాయి. ఇక శ్రుతి హసన్ ఈ సినిమాలో ప్రేక్షకులను వెంటాడుతుంది.ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ నటన కనబర్చింది. ఇక సహాయ పాత్రధారులు తమ వంతు పాత్ర పోషించారు. సున్నితమైన ఇతివృత్తం, పవన్ పెర్‌ఫార్మెన్స్, సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల, చిత్రించిన అద్భుతమైన విజువల్స్, అనూప్ రూబెన్స్ స్టన్నింగ్ మ్యూజిక్, గౌతంరాజు షార్ప్ ఎడిటింగ్ వంటివి ఈ సినిమాకు ఎసెట్ లాగా కుదిరాయి.
పాటలు, నేపద్య గీతాలు సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యాయనే చెప్పాలి. దర్శకుడు ఈ సినిమాను పవన్‌ని, ఆడియెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని తీశాడు. మొత్తం మీద అది పైసా వసూల్ మూవీయే.
ఫస్ట్ హాఫ్
ప్రారంభంలోనే వచ్చే ఫైట్, టైటిల్ సాంగ్ ఫస్ట్ హాఫ్‌కే హైలెట్‌గా నిలుస్తున్నాయి. పూర్తిగా తెలుపు దుస్తులతో యాక్షన్‌తో ఉన్న తొలి భాగం ప్రేక్షకులను, అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది.
సెకండ్ హాఫ్:
సెకండ్ హాఫ్‌లో కథ ప్రధానంగా శ్రుతిహసన్ కుటుంబంపైన, పవన్, విలన్‌ల మధ్య యాక్షన్ దృశ్యాలతో నిండి ఉంది. ఇతర సినిమాల్లో లాగానే సెకండ్ హాఫ్‌లో రొటీన్ కథే కొనసాగింది.
సినిమాపై అంచనా
మొత్తం మీద కాటమరాయుడు సమగ్రమైన, సంపూర్ణమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్. పవన్ కల్యాణ్ అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు పూర్తి స్థాయి వినోదం కలిగించేలా దర్శకుడు కిషోర్ కుమార్ కష్టపడ్డారు. తన పాత్ర లోని మంచి, చెడు అంశాలను పవన్ చాలా మంచినీళ్ల ప్రాయంగా ప్రదర్సించారు. టాలీవుడ్ సినిమాకు ఈ సినిమా కథ కొత్తది కాకపోవచ్చు కానీ, డైరెక్టర్ దీన్ని కొలత పోసి కుట్టినంత చక్కగా సినిమాను రూపొందించడంలో విజయం సాదించారు.తన కెరీర్‌లో పవన్ మరొక బెస్ట్ ఫిలిం, పెర్‌ఫార్మెన్స్ ను ప్రదర్శించారు. భారీ అంచనాలతోటే పవన్ వచ్చారు. అభిమానులకు పండగే అని చెప్పాలి. శుక్రవారం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలవుతున్న కాటమరాయుడు మీరు పెట్టే డబ్బుకు పూర్తి సంతృప్తిని ఇస్తుందంటే సందేహమే లేదు.
కొసమెరుపు: పవన్ పక్కా మాస్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్సే ఇప్పుడు మూవీకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో మెగా ఫ్యామిలీ అభిమానులు పటాసులు కాలుస్తూ సంబరాలు స్టార్ట్ చేయగా.. మరోవైపు కువైట్, మస్కట్‌లలో ఇప్పటికే షో పూర్తయింది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్లో స్పందిస్తున్నారు. పవర్ స్టార్ వన్ మ్యాన్ షో చేశారని, అత్తారింటికి దారేది తర్వాత మరో మెగా హిట్ పవన్ సొంతమని టాక్ వినిపిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా పంచెకట్టులో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.శుక్రవారం ఉదయం 3.30 గంటలకే కువైట్, మస్కట్ లలో విడుదలైన కాటమరాయుడు స్టార్టింగ్ రివ్యూ అదరగొట్టినట్లే చెప్పాలి. ప్రారంభ రేటంగ్ 4/5గా ఉందని చెబుతున్న కాటమరాయుడు బ్లాక్ బస్టర్ అంటే పక్కా అనే చెప్పాలి.
విడుదల తేదీ: మార్చి 24, 2017
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పర్దాసన్ (డాలీ)
నిర్మాత: శరత్ మరార్
సంగీతం : అనూప్ రూబెన్స్
స్టార్స్ : పవన్ కల్యాణ్, శ్రుతి హసన్
ప్రారంభ రేటింగ్ అంచనా : 4/5