Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 4న నాగశౌర్య, మాళవిక నాయర్ 'కళ్యాణ వైభోగమే'...

Advertiesment
kalyana vaibhogame movie
, సోమవారం, 15 ఫిబ్రవరి 2016 (18:49 IST)
యువతలో ప్రేమ, పెళ్లి వంటి బంధాలపై కొన్ని అభిప్రాయాలున్నాయి. అవి అందరికీ అర్థమయ్యేరీతిలో చెప్పే ప్రయత్నమే 'కళ్యాణ వైభోగమే' అని చిత్ర నిర్మాత కె.ఎల్‌. దామోదర్‌ ప్రసాద్‌ తెలిపారు. సెన్సారయిన ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 'అలా మొదలైంది' తర్వాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్నారు. 
 
నాగశౌర్య, మాళవిక నాయర్‌ నాయకానాయికలుగా నటించారు. ఇందులో ఆహ్లాదకరమైన కామెడీ, సంగీతం, భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కథా చిత్రమిదని పేర్కొన్నారు. 'అలా మొదలైంది' తర్వాత అంతే తపనతో చేసిన చిత్రమిదని దర్శకురాలు నందినిరెడ్డి తెలిపారు. 'అభిషేక్‌ పిక్చర్స్‌' ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu