Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగస్ట్‌ 15న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'రభస'

ఆగస్ట్‌ 15న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'రభస'
, బుధవారం, 30 జులై 2014 (18:28 IST)
యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా 'కందిరీగ' ఫేం సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకత్వంలో అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్‌బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'రభస'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 15న విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆగస్ట్‌ 1న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరగనుంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ - ''మా 'రభస' చిత్రం ఆడియోను సినీ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానుల సమక్షంలో ఆగస్ట్‌ 1న శిల్పకళావేదికలో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. థమన్‌ సారధ్యంలో రూపొందిన అన్ని పాటలూ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి. ఎన్టీఆర్‌, థమన్‌ కాంబినేషన్‌లో 'రభస' మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 15న వరల్డ్‌వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తున్నాం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుంది'' అన్నారు.
 
దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ''యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మా 'రభస' చిత్రంలో ఎన్టీఆర్‌ను కొత్త డైమెన్షన్‌లో ప్రజెంట్‌ చెయ్యబోతున్నాం. ఎన్టీఆర్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వున్నాయి. థమన్‌ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మ్యూజికల్‌గా కూడా ఈ చిత్రం చాలా హై లెవల్‌లో వుంటుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాట పాడడం ఓ హైలైట్‌ అని చెప్పొచ్చు. ఆగస్ట్‌ 15న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని, అభిమానుల్ని విశేషంగా అలరిస్తుంది'' అన్నారు. 
 
ఎన్టీఆర్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రణీత మరో హీరోయిన్‌. బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్‌, జయసుధ, సీత, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, అజయ్‌, నాగినీడు, శ్రావణ్‌, భరత్‌, రవిప్రకాష్‌, ప్రభాకర్‌, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ప్రేమ్‌రక్షిత్‌, శేఖర్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, విజయ్‌,  ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకటరత్నం(వెంకట్‌), సమర్పణ: బెల్లంకొండ సురేష్‌, నిర్మాత: బెల్లంకొండ గణేష్‌బాబు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

Share this Story:

Follow Webdunia telugu