Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంద్రుడు నాకు రీబర్త్‌... విశాల్‌

Advertiesment
indrudu movie
, మంగళవారం, 24 జూన్ 2014 (17:24 IST)
నార్కొలెప్సి స్లీపింగ్‌ డిజార్డర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తిరు ఈ కథ చెప్పినప్పుడు ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుందా లేదా అనే అనుమానం నన్ను వెంటాడింది. వెంటనే ఆ వ్యాధికి సంబంధించిన కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఈ సినిమా తప్పకుండా చెయ్యాలని నిర్ణయించకున్నాను. తమిళంలోనూ, తెలుగులోనూ ప్రేక్షకులు సినిమాను బాగా రిసీవ్‌ చేసుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌ నాకు రీబర్త్‌ లాంటిది అని విశాల్‌ అన్నారు.
 
విశాల్‌, లక్ష్మీమీనన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం 'నాన్‌ సిగప్పు మనిదన్‌'. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ- యుటీవీ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థలు ఇంద్రుడు' టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. సిద్ధార్ధ్‌రాయ్‌ కపూర్‌-విశాల్‌కృష్ణ నిర్మాతలు. తిరు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మంగళవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో విశాల్‌ పైవిధంగా స్పందించారు.
 
విశాల్‌ మాట్లాడుతూ... తిరు ఈ కథ చెప్పినప్పుడు అందులో క్లైమాక్స్‌, ట్విస్ట్‌లు చాలా నచ్చాయి. చెప్పినట్లుగానే తెరకెక్కించాడు. కొత్త కాన్సెప్ట్‌తో మంచి హిట్‌ ఇచ్చాడు. తెలుగు వెర్షన్‌కి కాస్త ట్రిమ్‌ చేశాం. కొత్త కథతో వచ్చిన సినిమాలను తప్పకుండా ఆదరిస్తారని మా సినిమా నిరూపించింది. వైజాగ్‌ సక్సెస్‌ టూర్‌కి వెళ్ళాం అక్కడ కూడా సినిమాకి మంచి స్పందన వస్తోంది అన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో శ్రీకాంత్‌ అనే కొత్త దర్శకుడితో తెలుగు స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నాను అని విశాల్‌ తెలిపారు. 
 
దర్శకుడు తిరు మాట్లాడుతూ... ఇటువంటి సబ్జెక్ట్‌ని హీరోలు ఒప్పుకోవడం చాలా కష్టం. నా హీరో మాత్రం కథ చెప్పగానే ఒప్పుకున్నాడు. తమిళంలోనే కాక తెలుగులో కూడా సినిమాకు మంచి ఆదరణ లభించింది అని అన్నారు.
 
313 థియేటర్‌లలో సినిమాను విడుదల చేశాం. ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో మరో 25 థియేటర్లు పెంచాం. కొత్త కథలతో సినిమాలు రావట్లేదు అనే వాళ్ళకి ఈ సినిమా మంచి సమాధానం అవుతుంది అని పి.డి.ప్రసాద్‌ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాటల రచయిత శశాంక్‌ వెన్నెలకంటి, అరవింద్‌గా నటించిన శ్రీనివాస్‌ కూడా మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu