Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హన్సిక 30 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. తెలుగులో కూడా...

Advertiesment
Hansika's 'Chandrakala' release date
, మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:20 IST)
'చందమామ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఇప్పుడు గ్లామర్‌స్టార్‌ హన్సిక ప్రధాన పాత్రలో 'చంద్రకళ' అనే భారీ చిత్రాన్ని సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ బేనర్‌పై సమర్పిస్తున్నారు. తమిళ్‌లో సెన్సేషనల్‌ హిట్‌ అయిన 'అరన్మణి' చిత్రాన్ని  'చంద్రకళ' పేరుతో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ బేనర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్‌ 19న విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 
ఈ చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ... ''తమిళంలో 'అరన్మణి' పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి 30 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. తెలుగులో కూడా ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు వుంది. హార్రర్‌ టచ్‌తో థ్రిల్లింగ్‌గా వుండే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. 
 
ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌ ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ అంతా హైదరాబాడ్‌లోనే జరగడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్‌ 19న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా బేనర్‌లో 'చందమామ' చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయిందో అంతకుమించి 'చంద్రకళ' హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు. 
 
హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్‌కుమార్‌ ఫోటోగ్రఫీ పెద్ద ఎస్సెట్‌ అయింది. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ నిర్మించిన ఈ భారీ చిత్రానికి పాటలు: వనమాలి, మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్‌, ఫోటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, ఫైట్స్‌: దినేష్‌, డాన్స్‌: రాజుసుందరం, గాయత్రి రఘురాం, శివశంకర్‌, సహనిర్మాత: పద్మాకరరావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు,కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుందర్‌ సి. 

Share this Story:

Follow Webdunia telugu