Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా..?

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. తొలి ప్ర‌య‌త్నంలో న‌టుడుగా మంచి పేరు తెచ్చుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్స‌స్ మాత్రం సాధించ‌లేదు. ఆ త‌ర్వాత న‌టించిన బ‌సంతి సినిమా కూడా విజ‌యాన్ని సాధించ‌లేదు.

Advertiesment
బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందా..?
, బుధవారం, 15 ఆగస్టు 2018 (14:39 IST)
బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. తొలి ప్ర‌య‌త్నంలో న‌టుడుగా మంచి పేరు తెచ్చుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్ హీరోగా స‌క్స‌స్ మాత్రం సాధించ‌లేదు. ఆ త‌ర్వాత న‌టించిన బ‌సంతి సినిమా కూడా విజ‌యాన్ని సాధించ‌లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని గౌత‌మ్ న‌టించిన చిత్రం మ‌ను. ఈ చిత్రంలో గౌత‌మ్ స‌ర‌స‌న చాందిని చౌద‌రి న‌టించింది. ఫ‌ణీంద్ర న‌ర్శెట్టి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన మ‌ను చిత్రం ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. ఇంట్ర‌స్టింగ్ ఉన్న ఈ ట్రైల‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసారు. దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల క్రితం హీరోగా ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ గౌత‌మ్‌కి స‌రైన స‌క్స‌స్ రాలేదు. దీంతో ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి.. గౌత‌మ్ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో లేదో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 ఇయ‌ర్స్ కెరీర్లో ఇదే బెస్ట్ అంటోన్న జ‌గ్గుభాయ్..!