Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బ్రీత్‌ హౌస్‌' పాటలు విడుదల

Advertiesment
february 14 movie
, శుక్రవారం, 17 జులై 2015 (18:43 IST)
బేబీ ప్రేమ, క్రిష్‌, ఈషా ప్రధాన పాత్రల్లో సత్యారావు నిర్మించిన సినిమా 'ఫిబ్రవరి 14'. బ్రీత్‌ హౌస్‌ అనేది ఉప శీర్షిక. విఎస్‌. ఫణీంద్ర దర్శకుడు. ఆడియో విడుదల శుక్రవారం నాడు జరిగింది. ఇ3 మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోను తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రసమయి బాలకిషన్‌ ఆవిష్కరించారు. అనంతరం రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రేమ కథకు హారర్‌ ఎలిమెంట్స్‌ను జోడించి తీశారు. ప్రస్తుతం ఈ తరహా చిత్రాలకే ఆదరణ లభిస్తోంది. ట్రైలర్‌ బాగుంది. ఖచ్చితంగా పెద్ద సక్సెస్‌ అవుతుంది' అన్నారు. 
 
రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ... అందరూ కొత్తవారితో తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరి ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు. నిర్మాత సత్యారావు మాట్లాడుతూ... పెళ్ళయిన తర్వాత గర్భవతి అయిన భార్యతో తన భర్త ఎలా ప్రవర్తిస్తాడనేది ఈ సినిమా. ఇదొక సందేశాత్మక చిత్రం. 
 
సెన్సార్‌ కూడా పూర్తిచేసుకుంది. త్వరలోనే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని' తెలిపారు. హీరో క్రిష్‌ తెలుపుతూ... ఈ సినిమాలో పాటలు కూడా వున్నాయి. ప్రేమ అనే పాత్ర చిత్రంలో ముఖ్యమైందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ రెడ్డి, కెమెరా: ప్రవీణ్‌ కె. ఎడిటర్‌: రామ్‌ జెపిరావు, సహ నిర్మాత: గండ్ల సరిత.

Share this Story:

Follow Webdunia telugu