పద్మశ్రీ మంచు మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కథానాయకుడిగా మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'కరెంట్ తీగ'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ కధానాయికలు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 17న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
'పోటుగాడు', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి వరుస విజయాల తర్వాత మంచు మనోజ్ 'కరెంట్ తీగ'తో హ్యాట్రిక్ సొంతం చేసుకునేందు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 'కరెంట్ తీగ' ఆడియో శ్రోతలను అలరిస్తుంది. సన్నీ లియోన్ నర్తించిన స్పెషల్ సాంగ్ 'కరెంట్ తీగ' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే మంచు మనోజ్ నటన, డేర్ డెవిల్ స్టంట్స్‌తో పాటు మనోజ్ స్వయంగా పాడిన దేవదాస్ బ్రేక్ అప్ సాంగ్ 'కరెంట్ తీగ' సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.
'కరెంట్ తీగ' చిత్రం క్లాస్ మాస్ అన్న తేడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే పూర్తి నమ్మకం తమకుందని చిత్ర దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు..!