Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'చారుశీల'కు రిలీఫ్... వచ్చేస్తుంది... ట్రెండ్ సృష్టిస్తుందట...

'చారుశీల'లోని కొన్ని ఫోటోల ఆధారంగా తమిళ్‌లో వచ్చిన 'జూలీ గణపతి' చిత్రానికి కాపీ అని కూనవరపు శ్రీనివాసరెడ్డి వేసిన కేసును కొట్టివేస్తూ ఆయన్ను మందలిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని 'చారుశీల' చిత్ర నిర్మాత సాగర్‌, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించార

Advertiesment
Charuseela Movie release date
, సోమవారం, 29 ఆగస్టు 2016 (19:54 IST)
'చారుశీల'లోని కొన్ని ఫోటోల ఆధారంగా తమిళ్‌లో వచ్చిన 'జూలీ గణపతి' చిత్రానికి కాపీ అని కూనవరపు శ్రీనివాసరెడ్డి వేసిన కేసును కొట్టివేస్తూ ఆయన్ను మందలిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని 'చారుశీల' చిత్ర నిర్మాత సాగర్‌, దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం నాడు చిత్ర టీజర్‌ను విడుదలచేస్తూ.. వారు మాట్లాడారు. రాజీవ్‌ కనకాల, రేష్మి కాంబినేషన్‌లో వచ్చిన సైకో థ్రిల్లర్‌కు స్పూర్తి ఓ ఆంగ్ల చిత్రం. దానిలోని ఓ పాయింట్‌ తీసుకుని చిత్రంగా మలిచాం.
 
ఈలోగా ఓ వ్యక్తి.. మా చిత్రంపై కేసు వేయడం.. కోర్టు, ఛాంబర్‌ ఆధ్వర్యంలో ముగ్గురు కమిటీని వేసి.. ఆంగ్ల చిత్రాన్ని, జూలీ.. చారుశీల.. చిత్రాలన్నీ మూడురోజుల పాటు చూసి తీర్పుచెప్పారు. ఆ చిత్రానికి దీనికి పొంతన లేదని తేల్చారు. మాపై అనవసరంగా కేసు వేసిన ఆ వ్యక్తిని మందలించడమే కాకుండా తగినంత ఫైన్‌ కూడా వేసింది అని చెప్పారు. 
 
ఇక చిత్రం గురించి చెబుతూ.. తెలుగులో ఇంతవరకు రాని కొత్త కాన్సెప్ట్‌. బ్రహ్మానందం అద్భుతమైన పాత్ర పోషించారు. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ.. ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా న్యాయమే గెలిచింది. మా సినిమాకు కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చింది. త్వరలో విడుదల కాబోయే ఈ చిత్రం తెలుగులో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తుందని చెప్పగలనని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నటి నగ్న చిత్రాలు నెట్లో హల్ చల్... రంగంలోకి దిగిన పోలీసులు