Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవంబర్‌ 7న వస్తున్న 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి'..!!

Advertiesment
'Brother of Bommali' on Nov 7th
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:23 IST)
ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అల్లరి నరేష్‌-మోనాల్‌ గజ్జర్‌ జంటగా అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రం 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి'. అల్లరి నరేష్‌కు ట్విన్‌ సిస్టర్‌గా కార్తీక నటిస్తోన్న ఈ చిత్రానికి 'వీడు తేడా' ఫేం బి.చిన్ని దర్శకుడు. శేఖర్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతానికి శ్రీవసంత్‌ బాణీలందించాడు. ఫుల్‌లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 7న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత అమ్మిరాజు కానుమల్లి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇటీవల విడుదలైన ఆడియోతోపాటు ట్రైలర్‌కు కూడా విశేషమైన స్పందన లభిస్తుండడం... 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' శాటిలైట్‌ హక్కులు భారీ మొత్తానికి ఓ ప్రముఖ ఛానల్‌ చేజిక్కించుకోవడంతో.. ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లో, ఇటు చిత్రసీమలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 
 
సిస్టర్‌ సెంటిమెంట్‌కి హిలేరియస్‌ కామెడీని జత చేసి బి.చిన్ని తెరకెక్కించిన 'బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ' చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu