Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూగవోయిన బ్రాహ్మణి : గాల్లో తేలిపోతున్న క్రిష్

నందమూరి బాలకృష్ట వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రీవ్యూ చూసిన బాలయ్య కుమార్తె బ్రాహ్మణి మాటలు రాకుండా మూగవోయిందని సమాచారం. తన తండ్రికి అంత గొప్ప చిత్రం తీసిపెట్టినందుకు సంతోషంతో పొంగిపోయిన బ్రాహ్మణి వెంటనే చిత్ర దర్శకుడు క్రిష్‌ని ప్రశంసల వర

Advertiesment
మూగవోయిన బ్రాహ్మణి : గాల్లో తేలిపోతున్న క్రిష్
హైదరాబాద్ , బుధవారం, 11 జనవరి 2017 (03:02 IST)
నందమూరి బాలకృష్ట వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రీవ్యూ చూసిన బాలయ్య కుమార్తె బ్రాహ్మణి మాటలు రాకుండా మూగవోయిందని సమాచారం. తన తండ్రికి అంత గొప్ప చిత్రం తీసిపెట్టినందుకు సంతోషంతో పొంగిపోయిన బ్రాహ్మణి వెంటనే చిత్ర దర్శకుడు క్రిష్‌ని ప్రశంసల వర్షంతో ముంచెత్తారని సమాచారం. బాలయ్య కుమార్తె స్వయంగా తనను ప్రశంసించడంతో క్రిష్ గాల్లో తేలిపోతున్నాడట. సినిమా విడుదల కావడానికి ఒక రోజు ముందే గౌతమీ పుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ అనే ధీమా దర్శకుడికి కలిగింది.
 
జనవరి 12. సరిగ్గా ఇక ఒకరోజు మాత్రమే మిగిలింది. బాలకృష్ణ వందోచిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ప్రీవ్యూని ప్రసాద్ ల్యాబ్స్‌లో మంగళవారమే చూసేసిన బ్రాహ్మణి పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. తల్లికి అపరిమిత గౌరవం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయిన గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో తన తండ్రి బాలయ్యను క్రిష్ చిత్రీకరించిన తీరు ఆమెను మంత్రముగ్ధురాలని చేసింది. తెలుగు గౌరవాన్ని నిలబెట్టిన ఉదాథ్త పాత్రలో నాన్న కనిపించడం కూతురుగా బ్రాహ్మణి గర్వించేలా చేసింది. ఇంత ఘనతర చరిత్రకు వెండితెరపై చూపించిన దర్శకుడు క్రిష్‌ని ఆమె మనస్ఫూర్తిగా ప్రశంసించారని సమాచారం. 
 
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం ద్వారా అమరావతి చరిత్రను తిలకించిన బ్రాహ్మణి భర్త నారా లోకేష్ సైతం తన మామయ్య బాలయ్య పాత్ర పోషణ చూసి ఫిదా అయిపోయనట్లు తెలుస్తోంది. శాతకర్ణి సినిమాలో ఇతర పాత్రధారుల నటనను కూడా లోకేష్ ప్రస్తుతించారట. నందమూరి కుటుంబ సభ్యులు ఇలా విడుదలకు ముందే తనను ప్రశంసల వర్షంలో ముంచెత్తడంతో క్రిష్ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. 
 
బ్రాహ్మణి, నారా లోకేష్‌లతో పాటు హీరో బాలకృష్ణ, వసుంధర, తేజస్విని, భరత్, కొర్రపాటి సాయి తదితరులు కూడా అదే సమయంలో గౌతమీపుత్ర శాతకర్ణిని ప్రీవ్యూలో తిలకించారట. సినిమా చూశాక వారి స్పందనలను గమనించిన క్రిష్ తన చిత్ర విజయానికి ఇక ఏ ఢోకా లేదని ముందే నిశ్చయానికి వచ్చేశారని తెలుస్తోంది. గురువారం విడుదల కానున్న గౌతమీపుత్ర శాతకర్ణి ఫలితాలకోసం క్రిష్ తీరుబడిగా వేచి చూస్తున్నట్లు సమాచారం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రివిక్రమ్ హరితేజను అంత చీఫ్‌గా చూశాడా?