Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలి బిగినింగ్‌తో పోలిస్తే, బాహుబలి కంక్లూజన్ వంద శాతం అద్భుతం!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ ట్విట్టర్ ద్వారా బాహుబలి2 టాక్‌ను లీక్ చేశాడు. బాహుబలి బిగినింగ్‌తో పోలిస్తే, బాహుబలి కంక్లూజన్ వంద శాతం అద్భుతమని, టాలీవుడ్‌, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడిం

బాహుబలి బిగినింగ్‌తో పోలిస్తే, బాహుబలి కంక్లూజన్ వంద శాతం అద్భుతం!
హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (07:45 IST)
ఇది రాజమౌళి, ప్రభాస్, బాహుబలి నిర్మాతలు, చిత్ర యూనిట్ అందరూ కలిసి పండుగ చేసుకోవలసిన వార్త. ప్రపంచ సినిమా పరిశ్రమలో ఇప్పుడు మార్మోగుతున్న పేరు బాహుబలి. బాహుబలి ది బిగినింగ్ సాధించిన ప్రభంజనంతో బాహుబలి2పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగానే బాహుబలి2 టీజర్, ట్రైలర్ సాధించిన అద్బుతమైన హిట్లతో అభిమానులు అయితే బాహుబలి 2వ భాగం గ్యారంటీగా సూపర్ హిట్ అని ముందే స్థిరం చేసుకున్నారు.
 
ఈ సినిమా లీక్‌లు బయటకు రాకుండా అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు దర్శకధీరుడు జక్కన్న. దీంతో ఇటీవలే సెన్సార్ బోర్డుకు సినిమాను చూపించినప్పుడు కూడా వారు చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అన్నది తప్ప వారు చిత్రం గురించి ఏమన్నారు అనే మాట కూడా బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు జక్కన్న. 
 
కానీ మరో కోణం నుంచి బాహుబలి-2 మూవీ టాక్ లీక్ కావడం విశేషం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ ట్విట్టర్ ద్వారా బాహుబలి2 టాక్‌ను లీక్ చేశాడు. బాహుబలి బిగినింగ్‌తో పోలిస్తే, బాహుబలి కంక్లూజన్ వంద శాతం అద్భుతమని, టాలీవుడ్‌, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడిందని చెప్పారు. ఉమైర్ సంధు కొంతకాలంగా పెద్ద సినిమాల ఫై రిలీజ్‌కు ముందే తన రివ్యూను తెలియజేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. వాటిలో కొన్ని నిజం కొన్ని అబద్దం అవుతున్నాయి.
 
అయితే ఉమైర్ సంగతి పక్కనపెడితే బాహుబలి2 సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవటమే కాకుండా తొలి రోజే 100 కోట్లను కొల్లకొట్టి.. వెయ్యికోట్ల క్లబ్‌లో చేరొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు. చిత్రం విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో చిత్ర యూనిట్ దేశవ్యాప్తంగా ప్రమోషన్ పనుల్లో ఉండిపోయింది. 
 
బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏప్రిల్ 27 సాయంత్రం మెగా ప్రీమియం ఏర్పాటు చేస్తున్నారు ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత కరణ్ జోహార్. ఆవిధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బాహుబలి-2 ని చూసే భాగ్యం బాలీవుడ్ సెలబ్రిటీలకు దక్కనుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలితో బడా దోపిడీ. పొరపాటున మల్టీప్లెక్స్‌‌కు వెళ్లారో.. జేబులు ఖాళీ చేసేస్తారు జాగ్రత్త.. పరువు పోతుంది జక్కన్నా..