Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్‌ 12న ఆర్జీవి-మంచు విష్ణుల 'అనుక్షణం'..!!

Advertiesment
Anukshanam movie
, సోమవారం, 18 ఆగస్టు 2014 (20:23 IST)
ఎ.వి.పిక్చర్స్‌ పతాకంపై 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు కథానాయకుడిగా రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అనుక్షణం'. పార్ధసారధి-గజేంద్ర నాయుడు-విజయ్‌ సంయుక్తంగా నిరిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని 'ఎ' సర్టిఫికెట్‌ అందుకొన్న విషయం తెలిసిందే. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న 'అనుక్షణం' చిత్రాన్ని సెప్టెంబర్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 
 
విడుదలైన ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడంతోపాటు.. తెలుగులో రాంగోపాల్‌వర్మ తొలిసారిగా పరిచయం చేసిన 'సినిమా వేలంపాట'కు అద్భుతమైన ఆదరణ లభించిందని, ఆర్జీవి-మంచు విష్ణుల కాంబినేషన్‌లో వచ్చిన 'రౌడీ' చిత్రం ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కాగా.. తాజా చిత్రం 'అనుక్షణం' ఇంటెన్స్‌ సస్పెన్స్‌ ధ్రిల్లర్‌. 
 
యువతులపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా 'అనుక్షణం' చిత్రం ఉంటుందని, రేవతి, నవదీప్‌ల పాత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, ఈ చిత్రంలోని సస్పెన్స్‌-యాక్షన్‌ సీన్స్‌ను రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన విధానం ధియేటర్‌లో ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని. 'అనుక్షణం' చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని చిత్ర నిర్మాతలు తెలిపారు. తేజశ్వి, రేవతి, మధుశాలిని, బ్రహ్మనందం, నవదీప్‌ తదితరులు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు!

Share this Story:

Follow Webdunia telugu