Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

31న తెరపైకి వస్తున్న "దీపావళి"

Advertiesment
31న తెరపైకి వస్తున్న
ఈ నెల 28న "దీపావళి" పండుగ వస్తుంటే... తమ చిత్రమైన దీపావళి ఈ నెల 31న వస్తోందని చిత్ర నిర్మాత తీగల కృపాకర్ రెడ్డి అన్నారు. ఎ.ఎ.ఎ. ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై వేణు తొట్టెంపూడి, మేఘానాయర్, ఆర్తి అగర్వాల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రానికి హరిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం సెన్సార్ పూర్తయి, క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన సందర్భంగా శనివారం ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ... ఈ సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకముందన్నారు. దీపావళి నాడు సరదాగా గడిపినట్లే తమ చిత్రాన్ని చూసిన వారంతా అంత ఆనందంగా ఉంటారని ఆయన చెప్పారు.

కథాపరంగా చెప్పాలంటే.. పల్లె నుంచి పట్టణానికి వచ్చిన వ్యక్తి కథ ఇదని, ఓ మనిషిని కాపాడే ప్రయత్నంలో అతనెన్ని కష్టాలను ఎదుర్కొన్నాడనే అంశంతో కథ నడుస్తుందని వెల్లడించారు. అందరూ దీపావళి చేసుకుంటే హీరో మాత్రం "దీపావళి" జరుపుకోడు. అది ఎందుకు? ఏమిటి? అనేది తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందేనని నిర్మాత అన్నారు. నిజ జీవితంలో తను అనుకున్నది ఏదైనా సాధిస్తే అదే అసలైన పండుగ అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చూపించామని ఆయన తెలిపారు.
webdunia

వేణుమాట్లాడుతూ... దీపావళి నాడే ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాత అడిగితే... ఆ రోజు మంగళవారం వచ్చిందని, సహజంగా సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయని గుర్తు చేశారు. అందుకే ఈ నెల 31న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని వేణు చెప్పారు. ఏది ఏమైనా కథ, కథనంతో కూడిన ఈ చిత్రం మా అందరికీ దీపావళి చేసుకున్నంత ఆనందాన్ని తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఆర్తి ఆగర్వాల్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.

వినోద్ కుమార్ మాట్లాడుతూ... ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర పోషించానని, వేణు పాత్ర నవ్విస్తుందని, అతని కెరీర్‌కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకముందన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో చలపతిరావు, హేమ, కొండవలస తదితరులు పాల్గొని చిత్రం విజయవంతం కావాలని అభిలషించారు.

Share this Story:

Follow Webdunia telugu