'షాడో' సెన్సార్ పూర్తయింది... త్వరలో వచ్చేస్తుంది!
, శనివారం, 20 ఏప్రియల్ 2013 (13:06 IST)
వెంకటేష్ నటిస్తున్న షాడో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఒకవైపు నాగార్జు నటించిన 'గ్రీకువీరుడు' చిత్రం ఈనెల 26న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే షాడో మాత్రం డేట్ ఇవ్వలేదు. షాడో వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత పరుచూరి కిరిటీని డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అడగడంతో వాయిదావేసే పరిస్థితి లేదని చెప్పినట్లు తెలిసింది. షాడో చిత్రం సెన్సార్ గురువారమే పూర్తయింది. ఈ చిత్రం చూసి సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నట్లు నిర్మాత వెల్లడించారు. రిలీజ్ సస్పెన్స్‌ను తెరదించేసందుకు శనివారం నాడు షాడో ప్లాటినం డిస్క్ జరుపనున్నారు. అక్కడ షాడో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.