మే 9న వస్తోన్న సాయిధరమ్ తేజ్ 'రేయ్'
, సోమవారం, 31 మార్చి 2014 (09:03 IST)
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో సాయిధరమ్ తేజ్. సాయిధరమ్ తేజ్ వెండితెరకు పరిచయమవుతోన్న 'రేయ్' సినిమా డేట్‌ను ఎట్టకేలకు ఫిక్స్ చేశారు. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఇప్పటికి చాలా సార్లు వాయిదాపడింది. ఇప్పుడు తాజాగా మరో విడుదల తేదీని నిర్ణయించారు. మే 9న దీనిని రిలీజ్ చేస్తారట.పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరుగుతుండడం వల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. దర్శకుడు వైవీయస్ చౌదరి ఈ సినిమాపై భారీ బడ్జెట్టుని పెట్టడమే కాకుండా, విలువైన సమయాన్ని కూడా వెచ్చిస్తున్నాడు. శ్రద్ధాదాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకి చక్రి సంగీతం అందించాడు. కరేబియన్ దీవుల్లో, యుఎస్‌లో షూట్ చేసిన ఈ సినిమాపై వైవిఎస్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.