Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేరా నామ్ ఇంజా... ఐ యామ్ ఎ పోర్న్ స్టార్... సన్నీ లియోన్... మరో 30 గంటల్లో జిస్మ్ - 2

Advertiesment
జిస్మ్ 2
, గురువారం, 17 ఏప్రియల్ 2014 (15:51 IST)
FILE
బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ నగ్న చిత్రాల అంచుల దాకా వెళ్లిపోయాయి. తాజాగా జిస్మ్ 2 ట్రెయిలర్ వీడియో చూస్తే ఇదే అర్థమవుతుంది. ఈ చిత్రంలో నటించిన పోర్న్‌స్టార్... సన్నీ లియోన్, తను అటువంటి స్టార్నేనని పరిచయం చేసుకుంటుంది. ఇక ట్రెయిలర్ లో హాటెస్ట్ సీన్లు గురించి వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇంతకుమునుపే సన్నీ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. తను ఇప్పటికే దుస్తులు లేకుండా కనిపించాను కనుక నగ్నసీన్లంటే సిగ్గు అని అనిపించలేదని సిగ్గు లేకుండానే చెప్పేసింది. ఇకపోతే ఈ చిత్రం మరో 30 గంటల్లో ఇండియన్ స్క్రీన్ల పైకి దూసుకు రాబోతోంది.

క్లాక్ వర్క్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిష్ ఐ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అడల్ట్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిన్మాలో హాటెస్ట్ పర్సంట్ ఎక్కువేనంటున్నారు. ఇంజా పాత్రలో సన్నీ లియోన్, అయాన్ పాత్రలో అరుణోదయ్ సింగ్ నటించారు.
webdunia
FILE


చిత్రమేమంటే ఇంతటి హాటెస్ట్ సిన్మాకు దర్శకత్వం వహించింది ఓ లేడీ డైరెక్టర్.. ఆమే పూజాభట్. ఈ చిత్రాన్ని నిర్మించినవారు పూజాభట్, డినో మోరియా. ఆగస్టు 3న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అప్పుడే ఆందోళనలు నిరసనలు మొదలయ్యాయి. పలుచోట్లు సన్నీ లియోన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. విడుదల తేదీ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu