మార్చి 28న ఆది 'ప్యార్ మే పడిపోయానే' రిలీజ్
, శుక్రవారం, 7 మార్చి 2014 (13:41 IST)
శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై గతంలో 'ఏమైంది ఈవేళ', 'అధినేత' వంటి చిత్రాల్ని అందించిన ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ తాజాగా లవ్‌లీ రాక్‌స్టార్ ఆది హీరోగా, దర్శకుడు రవిచావలి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ప్యార్ మే పడిపోయానే' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో హీరో ఆది ఇంట్రడక్షన్ సాంగ్ చేస్తున్నాం. మార్చి 11 నుంచి 18 వరకు విదేశాల్లో చిత్రీకరించే రెండు పాటలతో టోటల్‌గా షూటింగ్ పూర్తవుతుంది. మార్చి మూడోవారంలో ఆడియోను రిలీజ్ చేసి మార్చి 28న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. డైరెక్టర్ రవి చావలి ఈ సబ్జెక్ట్‌ని చాలా ఎక్స్‌లెంట్‌గా డీల్ చేస్తున్నారు. మా బేనర్‌లో వచ్చిన 'ఏమైంది ఈవేళ', 'అధినేత' చిత్రాల తర్వాత 'ప్యార్‌మే పడిపోయానే' హ్యాట్రిక్ చిత్రం అవుతుంది. ఆది పెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలెట్ అని చెప్పాలి. ఆదికి మరో మంచి సూపర్‌హిట్ చిత్రం అవుతుంది'' అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.కుమార్ మాట్లాడుతూ.. ''మా బేనర్‌లో వస్తోన్న మరో మంచి చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది'' అన్నారు. లవ్‌లీ రాక్‌స్టార్ ఆది, శాన్వి, వెన్నెల కిషోర్, కాశీవిశ్వనాధ్, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, సప్తగిరి, మధు, నరసింహా, పృధ్వీ, గురురాజ్, సత్యకృష్ణ, అనంత్, సంధ్యా జనక్, మాధవి సిద్ధం, విష్ణుప్రియ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్: కె.వి.రమణ, కాస్ట్యూమ్ డిజైనర్: టి.మణిశ్రీ, కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్.కుమార్, నిర్మాత: కె.కె.రాధామోహన్, రచన-దర్శకత్వ: రవిచావలి.