Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసెంబర్ 4న విడుదలకానున్న 'కుబేరులు'

Advertiesment
డిసెంబర్ 4 విడుదల కుబేరులు శ్రీనివాస్ రెడ్డి సెన్సార్ పోస్ట్ ప్రొడక్షన్ జ్యోతిలక్ష్మీ శివాజీ ఆలీ కృష్ణభగవాన్ రఘుబాబు ఎంఎస్
FileFILE
శివాజీ, ఆలీ, కృష్ణభగవాన్, ప్రధానంగా గోదావరి టాకీస్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కుబేరులు చిత్రాన్ని డిసెంబర్ 4న విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసుకన్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల్లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... 'కుబేరులు' అని టైటిల్‌తో పాటు ఉన్న 'వీళ్లకి అన్నీ అప్పులే' అనే క్యాప్షన్‌లో కామెడీ అంతా ఇమిడి ఉన్నట్లుగా వివరించారు. ముగ్గురి యువకుల చుట్టూ తిరిగే కథే ఈ చిత్రంగా పేర్కొన్నారు.

నటీనటులు దాదాపు పోటీ పడి నటించారని ప్రశంసించారు. ఎంఎస్ నారాయణ, రఘుబాబు, ఎల్‌బి శ్రీరాం, కొండవలస, ఏవీఎస్ తదితరులు హాస్యాన్ని పండించారన్నారు. ఈ చిత్రంలో పాతతరం నటి జ్యోతిలక్ష్మీ నృత్యం చేసిన ఓ పాట ప్రత్యేకమైనదన్నారు. ఇప్పటికే ఆడియోకు మంచి స్పందన వస్తోందని చెప్పిన దర్శకుడు జీవన్ తామస్ చక్కటి బాణీలను అందించారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu