కరుణానిధి, ఇళయరాజా సమక్షంలో 'రాజకోట రహస్యం' ప్లాటినమ్ డిస్క్
, సోమవారం, 15 ఏప్రియల్ 2013 (15:16 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డా. యం. కరుణానిధి రచించిన పొన్నార్ శంకర్ నవల ఆధారంగా అత్యంత భారీ తారాగణంతో కోట్ల బడ్జెట్‌తో కనీవినీ ఎరుగని భారీ సెట్టింగులతో రూపొందిన హిష్టారికల్ చిత్రం రాజకోట రహస్యం సినీస్టార్ సమర్పణలో సెన్షేషనల్ మూవీస్ బేనర్‌పై యువ నిర్మాత గోగినేని బాలకృష్ణ అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలు లెజెండ్ మ్యూజిక్ ద్వారా విడుదలై శ్రోతలను అలరిస్తున్నాయి. మ్యూజిక్ మ్యాష్ట్రో ఇళయరాజా సంగీత సారధ్యంలో రూపొందిన ఆణిముత్యాలాంటి పాటలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి.పార్ధసారథి సంగీత పర్యవేక్షణలో భారతీబాబు, సిరాశ్రీ, భాగ్యశ్రీ మంచి సాహిత్యంతో రాసిన పాటలను ప్రముఖ గాయనీ గాయకులు అలరిస్తున్నాయి, ఈ వారంలో ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డా. యం. కరుణానిధి, మ్యూజిక్ మ్యాష్ట్రో ఇళయరాజా, ప్రశాంత్, స్నేహ, డైరెక్టర్ త్యాగరాజన్ సమక్షంలో అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ పాటల చిత్రీకరణలోనూ వేలకొద్దీ డ్యాన్సర్లు, కంటిచూపుకందనంత దూరంలో సెట్టింగ్స్, ఇలా ఒకొక్క సాంగ్‌కి కోట్లు వెచ్చించి రూపొందించారు. భారీ తారాగణంతో, లక్షలకొద్దీ జనం, వేల సంఖ్యలో గుర్రాలు, అందాలను ఒలకబోసే తారలతో చిత్రం చూసే ప్రేక్షకుడికి కన్నుల పండుగ కలిగించే విజువల్ వండర్‌గా, ప్రముఖ ఫోటోగ్రాఫర్ షాజీకుమార్ సృష్టించిన మహా అద్భుతం ఈ చిత్రం. జీన్స్ వంటి బ్లాక్‌బష్టర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రశాంత్‌ను, మరోసారి ద్విపాత్రలలో చూపిస్తూ ఇద్దరు మిస్ వరల్డ్‌లను హీరోయిన్స్‌గా పరిచయం చేస్తూ, త్యాగరాజన్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రమిది. పూర్తి తెలుగుదనం కనిపించేలా చక్కటి సంభాషణలను శశాంక్ వెన్నెకంటి సమకూర్చారు. కుటుంబ సమేతంగా అన్ని తరహా ప్రేక్షకులు చూడవలసిన చిత్రమిది. మరో వారంలో సెన్సార్ కూడా పూర్తిచేసి ఏప్రిల్‌నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని నిర్మాత గోగినేని బాలకృష్ణ తెలిపారు. ప్రశాంత్ ద్విపాత్రలలో నటించగా, స్నేహ, మిస్ ఇండియాలు పూజాచోప్రా, దివ్యా పరమేశ్వరన్, భాను( స్పెషల్ అప్పీరియన్స్ ), ఖుష్భూ, సీత, సుకుమారి, ప్రభు, ప్రకాష్‌రాజ్, రాజ్‌కిరణ్, నాజర్, నెపోలియన్, విజయకుమార్, పొన్‌వన్నన్, రియాజ్‌ఖాన్, కెప్టెన్ రాజు, సంతాన భారతి, పొన్నాంబలం, తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, కథ, కథనం ; డా.. యం. కరుణానిథి ( తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ), సంగీతం ; మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, ఫోటోగ్రఫీ ; షాజీకుమార్, సంభాషణలు ; శశాంక్ వెన్నెలకంటి, పాటలు ; భాగ్యశ్రీ, భారతీబాబు, సిరాశ్రీ. నిర్మాత ; గోగినేని బాలకృష్ణ దర్శకత్వం ; త్యాగరాజన్