'కమలతో నా ప్రయాణం'కు మరో అవార్డు వస్తుందా!
, బుధవారం, 12 మార్చి 2014 (22:30 IST)
'1940
లో ఓ గ్రామం' చిత్రం ద్వారా జాతీయస్థాయి అవార్డు పొందిన దర్శకుడు నరసింహనంది. ప్రస్తుతం 'కమలతో నా ప్రయాణం' రూపొందించారు. ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది. ఈ చిత్రం గురించి అతిథులు మాట్లాడుతూ... ఇప్పటికే ఈ చిత్రాన్ని తమ థియేటర్లలో విడుదల చేయాలంటూ కొంతమంది ఎగ్జిబిటర్లు అడుగుతున్నారనీ, కథాగమనాన్ని దర్శకుడు చక్కగా తెరకెక్కించారని పేర్కొంటున్నారు. ఈ చిత్రం గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మల్టీడైమన్షన్ వాసు, దర్శకుడు మధుర శ్రీధర్ వంటివారు మాట్లాడుతూ... నిర్మాత మంచి చిత్రాన్ని తీయాలని ఈ రంగంలోకి వచ్చారు. రొటీన్ చిత్రం కాకుండా కొత్తగా ఉండాలని చెప్పడంతో... నరసింహనందిని పరిచయం చేయడం.. ఆయన చెప్పిన కథ నచ్చి సినిమాగా మార్చడం జరిగింది. చిత్రాన్ని చూశాము. చాలా బాగుంది. దర్శకునికి మరో అవార్డు తప్పకుండా దక్కుతుంది. నిర్మాతకు మంచి పేరు వస్తుందని అన్నారు.