Publish Date: Wed, 29 Oct 2014 (14:27 IST)
Updated Date: Wed, 29 Oct 2014 (14:29 IST)
జడ్జి పరిచయస్తుడితో : ఓ మీరా! నేను వకీలుగా ఉండగా సైకిలు దొంగిలించి వచ్చారు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ నైనపుడు మోటారు సైకిలు దొంగిలించారు. ఇప్పుడు నేను జడ్జి అయినప్పుడు కారు దొంగిలించారు. చాలా విచిత్రంగా ఉందే!
అపరాధి : ఏం లేదుసార్! మీ మాదిరిగానే నాకు కూడా ప్రమోషన్ వచ్చిందంతే సార్!