సాహిత్యం, సినిమా అనే రెండింటినీ వేరు వేరు భావనతో చూడకూడదనీ... సాహిత్యం సినిమాలో అంతర్భాగం కావాలని పలువురు రచయితలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి కథా రచయితల వర్క్‌షాప్‌లో రచయితలు పై విధంగా స్పందించారు.
ఖమ్మం, గుంటూరు, మహబూబ్‌నగర్, హైదరాబాద్, ప్రకాశం, నల్గొండ తదితర ప్రాంతాలనుంచి విచ్చేసిన అనేకమంది కథా రచయితలు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా బుక్ కల్చర్‌ను, లుక్ కల్చర్‌లోకి తీసుకువచ్చినట్లయితేనే సాహిత్యానికి మరింతగా ఆదరణ లభిస్తుందని రచయితలు వర్క్‌షాప్‌లో వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ కథకులు మాట్లాడుతూ... వర్ధమాన కథా రచయితలు ఏ విధంగా రాయాలో, కథల్లోని లోటుపాట్లను చర్చించి కథా నిర్మాణం వస్తువు ఎలా ఉండాలో వివరించారు. కాగా, ఈ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ప్రముఖ సీనియర్ కథకులు అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్మమరెడ్డి, జాతశ్రీ, నల్లూరి రుక్మిణి, జీవన్, నలిమెల భాస్కర్, వారాల ఆనంద్‌లతో పాటు 50 మంది రచయితలు పాల్గొన్నారు.