Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్-పాక్ మ్యూజిక్ ఫెస్టివల్ షాన్జ్ 2008

Advertiesment
భారత్-పాక్ మ్యూజిక్ ఫెస్టివల్ షాన్జ్ 2008
, మంగళవారం, 21 అక్టోబరు 2008 (02:22 IST)
భారత్, పాకిస్తాన్ సంగీతోత్సవాల్లో భాగంగా వరుసగా అయిదో ఏట అమృత్‌సర్‌లో జరిగిన షాన్జ్ 2008 సంగీతోత్సవానికి వేలాది మంది సంగీత ప్రియులు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాకిస్తాన్ నుంచి 35 మంది సంగీత కళాకారులు వాఘా సరిహద్దు గుండా అమృత్‌సర్ వచ్చారు.

పాకిస్తాన్‌కి చెందిన రఫి పీర్ థియేటర్ వర్క్‌షాప్, ప్రభుత్వేతర సంస్థ అయిన పునర్‌జ్యోతి కలిసి 2004లో ఈ సంగీతోత్సవాన్ని మొదటిసారిగా ప్రారంభించారు. వార్షిక ఉత్సవం భారత్‌లోని అమృత్‌సర్‌లో, పాక్‌లోని లాహోర్ నగరంలో రెండు చోట్ల జరుగతుంది. భారత్, పాక్ సంతతి పంజాబీయులను సన్నిహితం చేసే లక్ష్యంతో ఈ సంగీతోత్సవాలు ప్రారంభమయ్యాయి.

గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఉత్సవం చిన్నదే అయినప్పటికీ ఇరుదేశాల కళాకారులకు ప్రత్యేక గౌరవాభిమానాలను కల్పించింది. ఇరుదేశాలలో ఉన్న పంజాబీయులను సాంస్కృతికంగా ఒకటిగా చేయడమేగాక సంగీతం ద్వారా సోదరభావాన్ని పెంపొందింపజేయడ లక్ష్యంగా ఈ కార్యక్రమం నిరాంటంకంగా నడుస్తోంది.

ఈ సారి అమృత్‌సర్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో 22 మంది డ్రమ్మర్లు చక్కటి ఆర్కెస్ట్రాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. పది నిమిషాల పాటు సాగిన ఈ డ్రమ్మర్ల ప్రదర్శనకు పరవశించిన ఆడియన్స్ కరతాళధ్వనులతో కళాకారులను అలరించారు.

ఈ సందర్భంగా రఫి గ్రూప్ డైరెక్టర్ ఫైజాన్ ఫీర్జాదా మాట్లాడుతూ తమ హృదయాల్లో ఎవరి పట్లా ద్వేషభావం పెంపొందించుకోవడం లేదని చెప్పారు. ద్వేషం అనేది రాజకీయ స్థాయిలోనే ఉంటోందని, గత 60 ఏళ్లుగా ఇలాంటి రాజకీయ పరిణామాలను తాను చూస్తూనే ఉన్నానని అన్నారు. ఈ విద్వేషం వల్ల భారత్, పాకిస్తాన్ దేశాల్లో ఏ ఒక్కటీ బాగుపడలేదని అన్నారు.

భారత్ పెద్దన్న కాబట్టి అది చక్కగా పనిచేస్తోందని, ఇరుదేశాల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని రఫీ పేర్కొన్నారు. అయితే ఇరుదేశాలలోని ప్రజలు తమ సొంత గుర్తింపులను కలిగి ఉన్నారని వాటిని తాము కాపాడవలసి ఉందని ఫైజాన్ తెలిపారు.

అయితే రాజకీయేతరమైన లక్ష్యంతో తాము భారత్‌కు బయలుదేరినప్పటికీ భారత్ ప్రయాణానికి గాను వీసాలు పొందడంలో తాము చాలా కష్టాలు పడ్డామని రఫీ వాపోయారు. ఈ కార్యక్రమంలో భారతీయ కళాకారులు లక్విందర్ వాదల్ తదితరులు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు.

పునర్‌జ్యోత్ డైరెక్టర్ అయిన మన్వీన్ కౌర్ సంధు మాట్లాడుతూ ఈ సంగీతోత్సవం ద్వారా శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించేందుకు తమ రెండు సంస్థలు కంకణం కట్టుకున్నాయని చెప్పారు.

ప్రతి ఒక్కరూ శాంతి కోరుకుంటున్నారని, ఈ దృశ్యాన్ని తాను గత అయిదేళ్లుగా చూస్తున్నానని ఆమె అన్నారు. రెండు దేశాల జానపద కళారీతులను ఈ సంగీతోత్సవంలో ప్రదర్శించే కళాకారులు సాంప్రదాయక థీమ్‌ల ద్వారా సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారని ఆమె తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu