Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను మరాఠీ పుత్రుడినేః అమీర్‌ఖాన్

Advertiesment
నేను మరాఠీ పుత్రుడినేః అమీర్‌ఖాన్
, గురువారం, 25 సెప్టెంబరు 2008 (13:29 IST)
FileFILE
తాను మరాఠీగానే పుట్టానని, మహారాష్ట్రలోనే పెరిగానని ప్రసిద్ధ నట దర్శకుడు అమీర్‌ఖాన్ పేర్కొన్నారు. మరాఠీ వ్యక్తులే తనకు అదృష్టం తెచ్చిపెట్టినట్లుగా ఉందని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమీర్ పైవిధంగా చెప్పారు.

అమీర్ నిర్మాతగా వ్యవహరించిన లగాన్ చిత్ర దర్శకుడు అశుతోష్ గౌరీకర్ మరియు తారే జమీన్ పర్ చిత్ర స్క్రిప్ట్ రచయిత అమోల్ గుప్త ఇరువురూ మరాఠీలే కాబట్టే అమీర్‌ పంట పండిందనే భావాన్ని విలేఖరులు ప్రదర్శించినప్పుడు అమీర్‌ఖాన్ ఇలా స్పందించారు. ఈ రెండు చిత్రాలకు భారత్ తరపున ఆస్కార్ నామినేషన్ లభించిన విషయం తెలిసిందే.

నేను మరాఠీగా పుట్టి మహారాష్ట్రలోనే పెరిగాను కాబట్టి తను అదృష్టవంతుడినని అమీర్ ఈ సందర్భంగా చెప్పారు. పక్షంరోజుల క్రితం అమితాబ్ బచ్చన్ సహధర్మచారిణి జయాబచ్చన్ చేసిన వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదమయిన విషయం తెలిసిందే. తాను ఉత్తరప్రదేశ్ వాసిని కాబట్టి హిందీలోనే మాట్లాడతానని జయ చేసిన వ్యాఖ్య మరాఠీలలో ఆగ్రహజ్వాలలు రగుల్కొల్పింది.

భాషాభేదాలనేవి సమస్యే కాదని వాటిని రాజకీయ స్థాయిలో లేవనెత్తారని అమీర్ వ్యాఖ్యానించారు. మనమంతా ఒక దేశానికే చెందినవారిమని, భారత్‌లో పలు భాషలు, సంస్కృతులు ఉన్నాయని చెప్పారు. మన సంస్కృతిని మనం గౌరవిస్తూనే ఇతరుల సంస్కృతిని కూడా గౌరవిస్తామని పేర్కొన్నారు. సినిమా అనేది ఇలాంటి సరిహద్దులమధ్య గిరిగీసుకుని ఉండదని చెప్పారు.

భాష, మతం, కులం తదితర ప్రాతిపదికలపై మనలను విడదీయాలని ప్రయత్నించే రాజకీయ వాదులకు మనం దూరంగా ఉండాలని తాను తన స్నేహితులకు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటానని అమీర్ తెలిపారు. ప్రగతిశీలురుగానూ, సానుకూలవైఖరితోనూ ఉండి ప్రజలను మరింత సన్నిహితంగా కలిపే నేతలకే మనం బాసటగా ఉండాలని అమీర్ చెప్పారు.

అస్కార్ అవార్డును ఇంతవరకు ఏ భారతీయ సినిమా కూడా ఎందుకు సాధించలేకపోయిందన్న ప్రశ్నకు మనకన్నా ఇతరులు బాగా తీశారు కాబట్టే మనకు ఆస్కార్ దక్కలేదని అమీర్ బదులిచ్చారు. ప్రస్తుతం భారతీయ సినిమాకు చాలా మంది పరిస్థితి ఏర్పడిందని ఆశాభావం ప్రదర్శించారు.

లగాన్ చిత్రానికి ముందు ఆస్కార్ జ్యూరీ సభ్యులు ఎవరూ భారతీయ సినిమా ఎంట్రీని చూసేందుకు ఇష్టపడేవారు కాదని అమీర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు అయితే అదేసమయంలో ఇరానియన్ చిత్రాన్ని మాత్రం వారు చూడకుండా ఉండలేరని, అలాంటి పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu