18వ శతాబ్దానికి చెందిన టిప్పుసుల్తాన్ రత్నఖచిత స్వర్ణ సింహాసన ఛత్రాన్ని బ్రిటన్‌లో వేలంపాట వేశారు. వేలంపాటలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారు. కాగా వారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచారు. ఛత్రాన్ని 3,89, 600 పౌండ్లకు ఆ ఇద్దరిలో ఒకరు దక్కించుకున్నారు.
బ్రిటిష్ పాలనా కాలంలో టిప్పు సామ్రాజ్యం నుంచి పులి తలతో ఉన్న సింహాసనం మాయం కావడం చాలాకాలంగా చర్చనీయాంశం అయింది. అయితే ఆనయకు చెందిన అపురూప వస్తువులు బ్రిటిష్ వారి కాలంలోనే ఈస్టిండియా కంపెనీ ద్వారా ఇంగ్లండుకు తరలి వెళ్లినట్లు ఈ వేలంపాటతో చివరికి తేటతెల్లమైంది.
చిత్రమేమిటంటే, వందేళ్లుగా బ్రిటిషు ఖజానాలో ఉంటూ వస్తున్న ఈ ఛత్రం గురించి ఇంతకాలం టిప్పు సుల్తాన్ పరిశోధకులకు సైతం తెలియలేదు. ఇటీవల సాధారణ తనిఖీలో ఈ ఛత్రం ఉనికి వెల్లడైంది. కాగా టిప్పు సుల్తాన్‌కు చెందిన అద్భుతమైన కళాఖండాలు ఇప్పటికే బ్రిటిష్ రాజకుటుంబం వంతులవారీగా పంచేసుకుంది. అవిపోగా మిగిలిన ఛత్రం ఇలా వేలంపాటలో అమ్ముడైపోయింది.