భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఆగ్రా ఒకటి. అయితే ఈ నగరాన్ని చాలామంది పర్యాటకులు సందర్శిస్తున్నప్పటికీ, నగరం కేవలం ఇలా చూసి అలా వెళ్లే పాయింట్‌గా మాత్రమే ఉంటోంది. చాలామంది యాత్రికులు తాజ్ మరియు ఆగ్రాలోని ఇతర కళాఖండాలను సందర్శించి వెంటనే తమ విడిదికోసం ఢిల్లీకి లేదా జైపూర్‌కు వెళ్లిపోతుంటారు.
అలా కాకుండా ఆగ్రాలోనే పర్యాటకులు విడిది చేస్తే పర్యాటక సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడమే కాక, ఈ ప్రాతంలో ఉపాధి, వ్యాపారం తదితర కార్యకలాపాలను మెరుగు పర్చేందుకు కూడా వీలవుతుంది. ఈ కోణంలో ఇంతవరకు చేపట్టిన ప్రయత్నాలు విఫలం కావడం ఓ వాస్తవం కాగా, ప్రస్తుతం ఆ ఖాళీని పూరించేందుకు, ఆగ్రాలోని ప్రముఖ వాణిజ్య సంస్థ అశోక్ ఓస్వాల్ గ్రూప్ సాంస్కృతిక్ నాట్యశాల పేరుతో ఓ కొత్త కార్యక్రమం చేపట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, 2008 సెప్టెంబర్ 1 నుంచి కళాకృతి సాంస్కృతిక మరియు సాంప్రదాయ సదస్సులో మొహబ్బత్ ది తాజ్ ప్రదర్శించబడుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రోగ్రాంలో ప్రపంచ స్థాయి టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. ఆగ్రాలో ఇలాంటి విశిష్ట కార్యక్రమం జరపడం ఇదే మొదటిసారి. తాజ్‌మహల్‌కి సంబంధించిన అతి పెద్ద నమూనాను ఈ ప్రోగ్రాం వేదికపై పద్మాకారంలో కళాత్మకంగా చూపించబోతున్నారు.
తాజ్‌మహల్ నిర్మాణం నేపథ్యంలో, మొఘలాయ్ చక్రవర్తి షాజహాన్ అతడి సతీమణి ముంతాజ్ బేగంల నిరుపమాన ప్రేమకథను ఈ ప్రదర్శనలో 60 మంది కళాకారుల బృందంచే ప్రదర్శించనున్నారు. దీంట్లో భాగంగా 16వ శతాబ్దంలోని భారతీయ సంస్కృతిని కూడా అంతర్లీనంగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. హిందీ మరియు ఇంగ్లీష్ భాషలతో సహా 8 విభిన్న భాషల్లో ఈ ప్రోగ్రాం చూపించబడుతుంది.
ప్రేక్షకులు తాము కోరుకున్న భాషను ఎంచుకుని మరీ ఈ ప్రదర్శనను చూడవచ్చు. దీనికోసం ఈ నాట్యశాలలోని 585 సీట్లలో ప్రతి సీట్లోనూ అత్యున్నత నాణ్యత కలిగిన ఇయర్ ఫోన్స్‌ను ఇన్‌స్టాల్ చేశారు. గంట 15 నిమిషాలు పాటు జరిగే ఈ ప్రదర్శన ప్రతిరోజు రెండుసార్లు నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శన చూసేందుకు గాను ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో చూపించబడే తాజ్‌మహల్ నమూనా ప్రపంచంలో పాలరాయితో నిర్మించబడిన తాజ్ నమూనాలలో కెల్లా పెద్దది. అసలు తాజ్‌మహల్‌ను ప్రతిబింబింపచేయడం కోసం సాటిలేని నైపుణ్యం కలిగిన కళాకారులు పదేళ్లపాటు కృషి చేసి ఇక్కడి నమూనాను తీర్చిదిద్దారు.
అత్యున్నత సరౌండ్ సిస్టమ్‌తో కూడిన కళాకృతి కల్చరల్ అండ్ కన్వెన్షన్ సెంటర్... అంతర్జాతీయ కాన్ఫరెన్సులు, సెమినార్లు, ఉత్పత్తుల ఆవిష్కరణలు మరియు ఇతర కార్పొరేట్ కార్యకలాపాలకు చక్కటి కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడి ఓపెన్ ప్లేస్‌లో దాదాపు 20 వేలమంది కూర్చునే వీలుంది. దీంతో అంతర్జాతీయ కాన్ఫరెన్సులకు ఆగ్రా ఒక ముఖ్యమైన కేంద్రంగా మారిపోతుందనడంలో సందేహమే లేదు.
అశోక్ ఓస్వాల్ గ్రూప్‌కు పర్యాటక సంబంధిత వ్యవహారాల్లో 36 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ సంస్థ ప్రారంభించిన ఓస్వాల్ ఎంపోరియం, ఆగ్రా; టూర్ ఎయిడ్ (1) ఆగ్రా, ఓర్చా రిసార్ట్, ఓర్చా వంటివి గతంలో గొప్ప ఆవిష్కరణల్లా నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రారంభించిన కళాకృతి కల్చరల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఒక వరల్డ్ క్లాస్ సమర్పణగా రూపొందింది. ఈ సాంస్కృతిక కేంద్రం మరియు ఇక్కడ ప్రదర్శించబడే మొహబ్బత్ ది రాజ్ ప్రదర్శన భారత్ యొక్క ఆదర్శపూరిత ప్రతిబింబాన్ని సమర్పించడానికి గాను ప్రతి ప్రయత్నాన్ని దిగ్విజయంగా నెరవేర్చింది.