Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇజ్రాయెల్‌లో భారత్ నృత్యాలకు ఆదరణ

Advertiesment
ఇజ్రాయెల్‌లో భారత్ నృత్యాలకు ఆదరణ
, మంగళవారం, 16 డిశెంబరు 2008 (12:38 IST)
భారతీయ సంస్కృతికి ఇజ్రాయెల్‌లో ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులకు వీలైనంతమేరకు సాయం చేయడానకి తాను సిద్ధంగా ఉన్నట్లు భారత్ ప్రకటించింది. విదేశాలలో ఉన్నప్పటికీ పరస్పర అనుభవాలను పంచుకున్నట్లయితే దేశ, విదేశీ పౌరుల మధ్య వాస్తవంగానే గట్టి సంబంధాలు ఏర్పడతాయని ఇజ్రాయెల్‌లో భారత రాయబారి నవజీత్ సార్నా తెలిపారు.

ఇజ్రాయెల్ రాజధాని టెలి అవీవ్‌లో భారతీయుల బృందాన్ని ఉద్దేశించి సార్నా ప్రసంగిస్తూ, ఒక దేశంలో విద్యార్థిగా మరింత కాలం నివశిస్తే విస్తృతమైన అనుభవం గడించవచ్చని తెలిపారు. ఏ వ్యక్తి అయినా తనలో తెలియని నిగూడ శక్తిని దాచుకుని ఉంటారని, ఇతరులతో అనుభవాలను పంచుకున్నప్పుడు అవి వాస్తవ బంధాలుగా రూపాంతరం చెంది, తద్వారా బలమైన సంబంధం ఏర్పడుతుందని సార్నా పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రఖ్యాత ఒడెస్సీ డ్యాన్సర్ దుదు నటరాజ్ కోహెన్ కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌లో భారతీయ సాంప్రదాయ నృత్యాలకు ఆదరణ పెరుగుతోందని, కళపై అనురాగం పెంచుకున్నందుకు తాను గర్వపడుతున్నానని కోహెన్ చెప్పారు. ఇజ్రాయెల్ ఉన్న భారతీయులకు ఒడిస్సీ నేర్పడం ప్రారంభించానని, దీంతో వారు తనకు నటరాజు అనే ముద్దుపేరు తగిలించారని పేర్కొన్నారు.

ప్రవాస భారతీయుడైన ఆస్సాప్ ప్యాట్రిక్ గత సంవత్సరం తన భారత పర్యటన మధుర స్మృతుల గురించి చెప్పారు. గతేడాది తన భారత్ పర్యటన ఓ విహారయాత్రగా సాగిందని, భారతీయ ఆతిథ్యపు ఘనతను తాను ఆ సందర్భంగా రుచి చూశానని ప్యాట్రిక్ తెలిపారు.

తొమ్మిదేళ్ల క్రితం భారత్‌లో తాను చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఐసిసిఆర్ ఫెలోషిప్ కింద తాను 1998లో ఢిల్లీలోని కేంద్రీయ హిందీ సంస్థాన్ వద్ద హిందీ నేర్చుకున్నానని చెప్పారు. తాను ఇజ్రాయెల్ తిరిగి వెళ్లిపోయాక అక్కడి వివిధ పత్రికలలో భారతీయ సంస్కృతి గురించి వివిధ వ్యాసాలు రాశానని ప్యాట్రిక్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu