Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్తకళా సమ్మేళనం... అద్భుత కళాకృతుల నిలయం

హస్తకళా సమ్మేళనం... అద్భుత కళాకృతుల నిలయం
, శనివారం, 1 సెప్టెంబరు 2012 (20:35 IST)
WD
భారతదేశం సకల కళలకు అన్నపూర్ణ.. అటువంటి పూరాతన కళలతో సృజనాత్మకత మేళవించి చేసే వస్తువులు చూడముచ్చటగొలుపుతూ జీవం పోసుకున్నట్లు కనిపిస్తాయి.. భారతదేశంలోని హస్త కరిగార్ సొసైటీ ఢిల్లీ వారు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రాణం పోసేందుకు అత్యంత నైపుణ్యంతో చేసిన హస్త కళల ఎక్జిబిషన్‌ను చెన్నైలో నిర్వహించనున్నారు.

ఈ ఎక్జిబిషన్‌ చెన్నైలోని గ్రీమ్స్ రోడ్‌లోని లలితకళా అకాడమీలో సెప్టెంబర్ ౩వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ఎక్జిబిషన్‌లో ప్రతీ ఒక్కరి కావాల్సిన చేతితో తాయారు చేసిన వస్తువులు అందుబాటు ధరలలో లభించును. రూ.౩౦ నుండి మొదలుకుని రూ.20,౦౦౦ వరకు ఈ ఎక్జిబిషన్‌లో లభిస్తాయి.

ప్రతీ యేటా వీరు తయారు చేసిన వస్తువులను సందర్శకుల ముందు వారు ఎంతటి నైపుణ్యంతో తయారుచేశారు ప్రదర్శిస్తారు. అదే మాదిరి ఈ సంవత్సరం కూడా పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ , రాతి మరియు లక్క ఆభరణాలు మరియు తదితర వస్తువుల తయారీ విధానంలో తమ కళలను ప్రదర్శించనున్నారు.

అత్యంత కళాత్మకంగా రూపొందించిన వస్తువులను కూడా ఈ ఎక్జిబిషన్‌లో ప్రత్యేకంగా అమ్మకానికి ఉంచనున్నారు. పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సాలకు చెందిన కోయజాతి వారి పేపర్ చిత్ర లేఖనాలు, కునా గడ్డి కళాకృతులు, ఆంధ్రప్రదేశ్ నుండి కలంకారి వస్తువులు వీటితో పాటుగా మధ్యప్రదేశ్, తుస్సార్, జార్ఖండ్‌ తదితర ప్రాంతాలలో మగ్గాలపై నేసిన చీరలు, చేనేత వస్త్రాలు ఇలా ఒకటేమిటీ భారత్‌లోని మారుమూల పల్లెల కళాకృతుల అందాలు కూడా ఈ ఎక్జిబిషన్‌లో తళుక్కున మెరవనున్నాయి.

ఇలా దేశంలోని పలు ప్రాంతాల కాళాత్మకతల సమ్మేళనమే ఈ హస్తకళా ప్రదర్శన. పర్యావరణానికి హాని కలిగించని ఈ వస్తువులను కొనుగోలు చేసి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోమని పిలుపునిస్తున్నారు నిర్వాహకులు.

Share this Story:

Follow Webdunia telugu