Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతీయ పెయిటింగ్‌లకు విదేశీ నీరాజనాలు

Advertiesment
భారతీయ పెయిటింగ్‌లకు విదేశీ నీరాజనాలు
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (13:19 IST)
సమకాలీన అంశాలపై భారతీయ చిత్రకారుడు సుబోధ్ గుప్తా చిత్రించిన ఆయిల్ పెయింటింగ్ ఇటీవల జరిగిన ఓ అంతర్జాతీయ వేలంపాటలో రూ4.28 కోట్లవరకు ధర పలికి హాజరైన వారిని నివ్వెరపర్చింది. 32 దేశాలకు చెందిన వారు పోటీ పడిన ఈ ఆన్‌లైన్ వేలంపాటలో భారతీయ సమకాలీన చిత్రకారులకు చెందిన వందకు పైగా చిత్రాలు పోటీ పడ్డాయి.
భారత్ మెరుస్తోంది...
  రవివర్మ, దామెర్ల రామారావు వంటి అలనాటి ప్రపంచ ప్రఖ్యాత భారతీయ చిత్రకారులకు వారసులుగా నేటి భారత చిత్రకళాకారులు విదేశీ వేలంపాటల విక్రయాల్లో విజయ దుందుభిలు మోగిస్తుండటం ముదావహం. ప్రాంతీయతకు అంతర్జాతీయ స్వభావాన్ని కల్పించడమే వీరి విజయ రహస్యం...      


పాలిష్ చేయబడిన పాన్‌లతో కూడిన థియేటర్‌, స్టెయిన్‌లెస్ స్టీల్ కిచెన్ పాత్రలు, సప్తసముద్రాలపై చిత్రం వంటి అంశాలతో గుప్తా గీసిన చిత్రానికి రూ3.4 కోట్ల ధర పలకడం విశేషం. లండన్‌లో జరిగిన శాఫ్రన్ ఆర్ట్ వసంతకాల ఆన్‌లైన్ వేలంపాటలో భారతీయ చిత్రకారుల సృజనకు రూ29 కోట్లు లభించడం విశేషం. ఇది వేలం నిర్వాహకులు వేసిన అంచనా కంటే 72 శాతం ఎక్కువ కావడం విశేషం.

బీహార్‌కు చెందిన చిత్రకారుడు సుబోధ్ గుప్తా ఈ ఆన్‌లైన్ పాటలో ఇతర భారతీయ చిత్రకారులను అధిగమించారు. ఆసక్తి కలిగిన విదేశీ కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఇటీవలి కాలంలో భారతీయ యువ చిత్రకారులు తమ చిత్రాలకు దేశీయ, విదేశీ సాంప్రదాయిక ధోరణులను అత్యంత సృజనాత్మకంగా చొప్పిస్తూ వస్తున్నారు. దీంతో విదేశీ నిర్వాహకులు ఏర్పరుస్తున్న వేలంపాటలలో భారతీయ చిత్రకారుల చిత్రాలకు కాసుల వర్షం కురుస్తూ వస్తోంది.

బ్రిటిష్ వేలం పాటల సంస్థ సదర్బీ ఇటీవలే రాఖిబ్ షా చిత్రించిన "ది గార్డెన్ ఆప్ ఎర్త్‌లీ డిలైట్స్ 111" చిత్రాన్ని 5,491,7555 డాలర్లకు విక్రయించింది. 2007లో ఈ వేలం పాటల నిర్వాహక సంస్థ భారతీయ ఆధునిక, సమకాలీన, ప్రాచీన కళా రూపాలపై 40,697,437 అమెరికన్ డాలర్ల వరకు వ్యాపారం చేయగలిగింది. ఈ సంవత్సరం ఇప్పటికే 20,607,6348 డాలర్ల విలువైన భారతీయ చిత్రాలను ఈ సంస్థ విక్రయించగలిగింది.

పాశ్చాత్య దేశాల ప్రజలకు భారతీయ సమకాలీన కళ ఇక ఏ మాత్రం విదేశీయంగా లేదని సదర్బీ యూరప్ మరియు ఆసియా కార్యకలాపాల డిప్యూటీ ఛైర్మన్ హెన్రీ హోవార్డ్-స్నియడ్ ప్రశంసించారు. ఉదాహరణకు సుబోధ్ గుప్తా చిత్రించిన పెయింటింగ్ భారత చిత్రం గా లేదని అది ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా సరే సంబంధించిన లక్షణాలను కలిగి ఉందని పేర్కొన్నారు.

మొత్తంమీద భారతీయ చిత్రకారుల పంట పండుతోంది మరి....

Share this Story:

Follow Webdunia telugu