Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను బహుళ ప్రాంతీయ కథనాలలో పనిచేయడానికి ఇష్టపడతాను: వరుణ్ బడోలా

image
, శనివారం, 9 సెప్టెంబరు 2023 (15:31 IST)
జీ థియేటర్ యొక్క 'రాంగ్ టర్న్'లో లేయర్డ్ క్యారెక్టర్‌ను పోషించిన నటుడు ఇప్పుడు ఈ టెలిప్లే తెలుగులోకి అనువదించబడటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్విస్ రచయిత ఫ్రెడరిక్ డ్యూరెన్‌మాట్ 1956లో రాసిన నవల 'డై పన్నె' (ది బ్రేక్‌డౌన్) స్ఫూర్తితో, జీ థియేటర్ నిర్మించిన రంజిత్ కపూర్ యొక్క  ప్రశంసలు పొందిన టెలిప్లే 'రాంగ్ టర్న్' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రేక్షకుల కోసం తెలుగులోకి అనువదించబడుతోంది. టెలిప్లేలో లేయర్డ్ క్యారెక్టర్‌ని పోషిస్తున్న ప్రముఖ నటుడు వరుణ్ బడోలా ఇప్పుడు 'రాంగ్ టర్న్' ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతుందని సంతోషంగా  వెల్లడించారు. "డబ్బింగ్, సబ్‌టైటిలింగ్, అనువాదాల వల్ల బహుభాషా కథలు గతంలో కంటే ఎక్కువ మందికి చేరుతున్నాయి. రెండు తమిళ యాడ్ ఫిల్మ్‌లు చేసాను, కానీ నటుడిగా, నేను ఈ మార్పులో భాగం కావాలని ఎదురు చూస్తున్నాను. మరెన్నో ప్రాంతీయ కథనాలలో పని చేయడానికి ఇష్టపడతాను" అని ఆయన వెల్లడించారు. 
 
'రాంగ్ టర్న్'లో, అతను అరుణ్ పాత్రను పోషించాడు, ఒక వర్షం కురుస్తున్న రాత్రి, తన కారు చెడిపోయిన తర్వాత పాత ఇంట్లోకి వెళ్తాడతను. ఇక్కడ, అతను ముగ్గురు రిటైర్డ్ లాయర్లను కలుసుకోవడంతో పాటుగా వినోదభరితమైన ఒక గేమ్‌తో వారితో చేరడానికి అంగీకరిస్తాడు. ఈ న్యాయవాదులు ఒక ట్రయల్ సన్నివేశాన్ని పునఃసృష్టిస్తారు. వెంటనే అరుణ్ ఆ ఆటలో చిక్కుకున్నాడు. నేరం రుజువైతే, అతను ఊహించలేని విధిని కూడా ఎదుర్కోవచ్చు. 'రాంగ్ టర్న్' వంటి నాటకాలు ఇప్పుడు భావితరాల కోసం ఆర్కైవ్ చేయబడుతున్నందుకు సంతోశాన్ని వ్యక్తం చేసిన వరుణ్ మాట్లాడుతూ, "సాధారణంగా ఒక థియేటర్ గ్రూప్ విభిన్న ప్రేక్షకులను చేరుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్లాలి, కానీ ఇప్పుడు టెలిప్లే ఇంట్లో నే థియేటర్‌ వంటి అనుభవంను పునఃసృష్టిస్తుంది. వివిధ భాషలలో వీక్షించే అవకాశం కలగటం మాత్రమే కాదు, సుసంపన్నమైన సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తుంది మరియు భాషా అవరోధాన్ని కూడా ఛేదిస్తుంది. OTT చాలా మంది అద్భుతమైన ప్రాంతీయ నటులను మనకు పరిచయం చేసింది మరియు ఇప్పుడు 'రాంగ్ టర్న్' ద్వారా తెలంగాణలోని ప్రేక్షకులు కూడా మమ్మల్ని తెలుసుకుంటారు" అని అన్నారు. 
 
ఈ  నాటకం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆయన నమ్ముతున్నారు, ఎందుకంటే ఇది ఒక లీగల్ డ్రామా మాత్రమే కాదు, కవితాత్మక  న్యాయం యొక్క భావనను అన్వేషించే కథ కూడా. ఆయన దీని గురించి మరింతగా వివరిస్తూ, "మితిమీరిన కంటెంట్ యుగంలో, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన జానర్‌ల వైపు ఆకర్షితులవుతున్నారు. కాబట్టి మంచి రచన- బలమైన ప్రదర్శనల కోసం వెతుకుతున్న వారు ఈ నాటకాన్ని చూస్తారు. అంతేకాకుండా, చట్టపరమైన మరియు సహజ న్యాయం అస్పష్టంగా ఉండే మాక్ ట్రయల్ గురించిన కథనం ప్రేక్షకుల దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది" అని అన్నారు. 
 
'రాంగ్ టర్న్' సెప్టెంబర్ 16న తెలుగులో డిష్ టీవీ & డి2హెచ్ రంగ్‌మంచ్ యాక్టివ్ మరియు ఎయిర్‌టెల్ థియేటర్‌లో ప్రసారం చేయబడుతుంది. ఈ నాటకంలో గోవింద్ నామ్‌దేవ్, లలిత్ తివారీ, సునీల్ సిన్హా, లిలిపుట్ ఫరూకీ, సుజానే ముఖర్జీ, అనంగ్షా బిస్వాస్, షాలినీ శర్మ, నీరజ్ సాహ్ కూడా నటించారు. దీనికి రంజిత్ కపూర్ దర్శకత్వం వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిస్టరీ క్రియేట్ చేసిన షారూఖ్ ఖాన్.ఫస్ట్ డే 129.6 కోట్లతో జవాన్